దువ్వాడ జగన్నాధం రివ్యూ & రేటింగ్

June 23, 2017
img

రేటింగ్ : 2.5/5

కథ : 

చిన్నప్పటి నుండి అన్యాయాన్ని సహించని దువ్వాడ జగన్నాధం (అల్లు అర్జున్) మనం చేసే పనిలో మంచి కనబడాలే కాని మనిషి కనిపించాల్సిన అవసరం లేదు అన్న తాత చెప్పిన మాటని పట్టుకుని పోలీస్ ఆఫీసర్ మురళి శర్మతో చేతులు కలిపి విజయవాడలోని రౌండిల గ్యాంగ్ ల పని పడుతుంటాడు. ఈ క్రమంలో తనకి బాగా దగ్గరైన చంద్ర మోహన్ మరణానికి అగ్రి డైమండ్ సంస్థ కారణమని తెలుసుకుని దాని మీద యుద్ధనికి నడుం బిగిస్తాడు. తాను ఎవరో తెలియకుండా పోలీస్ ఆఫీసర్ మురళిశర్మతో కలిసి విలన్ గ్యాంగ్ ను టార్గెట్ చేస్తాడు. అగ్రి డైమండ్ చైర్మన్ రొయ్యల నాయుడు (రావు రమేష్) బినామి పేర్లతో ఆ బిజినెస్ నడిపిస్తాడు. ఈ క్రమంలో తన పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడతాడు. రొయ్యల నాయుడిని డిజె ఎలా పట్టుకున్నాడు..? హీరోయిన్ పూజా డిజె ఎలా ప్రేమలో పడ్డారు..? పూజా తండ్రికి నాయుడికి ఉన్న సంబంధం ఏంటి అనేది అసలు కథ.    

విశ్లేషణ :

దువ్వాడ జగన్నాధం సినిమా అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్ర ఒక్కటి తప్ప మిగతా అంతా ఓ కమర్షియల్ సినిమా సబ్జెక్ట్ ఎన్నో సార్లు చూశాం అన్న భావన వస్తుంది. కథ కథనాల్లో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. మొదటి సగం కాస్త ఎంటర్టైనింగ్ గా నడిపించినా సెకండ్ హాఫ్ అది కూడా లేకుండా చేశారు.

బన్ని లాంటి ఎనర్జిటిక్ స్టార్ దొరికితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. కేవలం బన్ని ఎనర్జీ ఒక్కటే సినిమాకు హైలెట్.. హీరోయిన్ పూజాని బాగా వాడుకున్నారని అనుకోవచ్చు. సినిమాలో క్లైమాక్స్ అసలు బాగాలేదు. సినిమా అంతా సగటు ఆడియెన్ ముందే ఊహించేదిలా ఉంటుంది. కథలో విలన్ క్యారక్టరైజేషన్ ఇచ్చిన బిల్డప్ బాగుంటుంది కాని అంత సర్కిల్ ఉండి డిజెని ఎదుర్కోకపోవడం కాస్త కామెడీగా ఉంటుంది.

సినిమా కోసం దర్శకుడు బాగా కష్టపడినట్టు అనిపించినా కేవలం రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లేలతో మెగా ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చేలా సినిమా ఉంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కచ్చితంగా డిజె నచ్చే అవకాశం లేదు. 

నటన, సాంకేతికవర్గం :

సినిమాలో బన్ని చాలా ఈజ్ తో నటించాడు.  క్యారక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు అనిపిస్తుంది. బన్ని సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు. ఇక పూజా హెగ్దె కూడా బికిని లుక్ తో అదరగొట్టింది. సినిమాలో అదనపు ఆకర్ష్ణణ అయ్యేందుకు కృషి చేసింది. విలన్ గా రొయ్యల నాయుడు ఓకే. అయితే అతని పవర్ కు తగ్గ క్యారక్టర్ హైలెట్ చేయలేదు. విలన్ ఓ రకంగా వీక్ అనిపిస్తాడు. ఇక సుబ్బరాజు పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈమధ్య విలనిజం వదిలేసి సుబ్బరాజు కామెడీ, సపోర్టింగ్ రోల్స్ వేస్తుండటం విశేషం. మురళిశర్మ నటన బాగుంది. తనికెళ్ళ్ల భరణి, వెన్నెల కిశోర్ అంతా బాగానే చేశారు.

ఇక డిజె టెక్నికల్ టీం విషయానికొస్తే.. దర్శకుడు హరిష్ శంకర్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. రొటీన్ కథ కథనాలతో సినిమా నడిపించాడు. బోస్ సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి మ్యూజిక్ అదరగొట్టేసింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.     

ఒక్కమాటలో :

డిజె రొటీన్ కథ కథనాలతోనే వచ్చాడు.

Related Post