హిట్ : రివ్యూ

February 28, 2020
img

విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ డైరక్షన్ లో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా హిట్. రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన విక్రం (విశ్వక్ సేన్) ఆల్రెడీ తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అలాంటి టైం లో తను ప్రేమించిన నేహా (రుహాని శర్మ) మిస్ అవడంతో అతను ఆ కేస్ డీల్ చేయాలని అనుకుంటాడు. అయితే అది వేరే వాళ్లు చూస్తున్నారని తెలుసుకుని 3 నెలల క్రితం నుండి నడుస్తున్న ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసు అతను డీల్ చేస్తాడు. అయితే ప్రీతి కేస్ చూస్తున్న టైం లో నేహా కేస్ కు సంబందించిన క్లూస్ దొరుకుతాయి. ఇంతకీ ప్రీతి, నేహాలను కిడ్నాప్ చేసింది ఒకరేనా..? ఈ ఇద్దరి మిస్సింగ్ కేసులను విక్రం ఎలా సాల్వ్ చేశాడు. తప్పిపోయిన ప్రీతి, నేహాలు సురక్షితంగా బయటకు వచ్చారా..? విక్రం ఏ క్లూస్ తో వారిని పట్టుకున్నాడు..? అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్ని ఒకేలా అనిపిస్తాయి. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు అనుమానించేలా ఉంటారు. అలానే హిట్ మూవీలో కూడా ప్రీతి, నేహాల మిస్సింగ్ తో స్టోరీ నడుస్తున్న టైం లో ప్రతి ఒక్కరిని అనుమానించేలా చేస్తాడు దర్శకుడు శైలేష్. తను రాసుకున్న కథను ఎక్కడ ట్రాక్ తప్పకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా చేశాడు.

సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించేలా ఉన్నా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు ఉంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం చాలా బాగున్నాయి. సినిమాకు అవే హైలెట్ అంశాలు అని చెప్పొచ్చు. దర్శకుడు శైలేష్ మొదటి సినిమానే అయినా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఎక్కడ ఏ లాజిక్ మిస్ అవకుండా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా చేశాడు.

అయితే కమర్షియల్ అంశాలు లేకపోవడం.. ఎంచుకున్న కథకు తగినట్టు కథమ రాసుకున్న శైలేష్ కు మంచి మార్కులు పడ్డాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కష్టమే కాని యూత్ ఆడియెన్స్ చూసేలా ఉంది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ఆడియెన్స్ కు ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఫైనల్ గా విశ్వక్ సేన్ తో నాని చేసిన ఈ హిట్ మూవీ హిట్ అందుకుంది. సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్న యూనిట్ సినిమాను సస్పెన్స్ లో వదిలేసి పార్ట్ 2 ఉందని చెప్పడం విశేషం. 

నటన, సాంకేతికవర్గం :

విశ్వక్ సేన్ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. విక్రం పాత్రకు ఆయన పర్ఫెక్ట్ అనిపించాడు. రుహాని శర్మ తన పాత్ర వరకు బాగా చేసింది. ఇక సినిమాలో మురళి శర్మ, హరితేజ, బ్రహ్మాజి, రోహిత్ పాత్ర చేసిన అతను బాగానే చేశారు. సినిమాలో మిగతా వారంతా పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ చాలా హెల్ప్ అయ్యింది. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. బిజిఎం చాలా క్లవర్ గా ఇచ్చాడు. ఇక సినిమా కథ, కథనాలు దర్శకుడు శైలేష్ తన బెస్ట్ ఇచ్చాడు. కథ పాతదే అయినా కథనం చాలా క్లవర్ గా రాసుకున్నాడు. నాని, ప్రశాంతి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో : 

హిట్.. టైటిల్ కు తగినట్టుగా హిట్ కొట్టేసింది.

రేటింగ్ : 3/5



Related Post