సరిలేరు నీకెవ్వరు : రివ్యూ

January 11, 2020
img

సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజైంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తనకు ఎవరు లేని అజయ్ కృష్ణ (మహేష్ బాబు) ఆర్మీ ఆఫీసర్ గా చేస్తుంటాడు. ఒక ఆపరేషన్ లో అజయ్ తన స్నేహితుడు అజయ్ (సత్య దేవ్) లైఫ్ రిస్క్ లో ఉండటంతో అతని ప్లేస్ లో అతని చెల్లి మ్యారేజ్ జరిపించడానికి కర్నూలు వెళ్తాడు. కర్నూలులో దిగడమే మినిస్టర్ నాగేంద్ర టార్గెట్ చేయడంతో ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) ఇంకా ఆమె ఫ్యామిలీ మొత్తం రిస్క్ లో పడుతుంది. భారతికి అండగా నిలిచిన అజయ్ నాగేంద్ర ను రివర్స్ లో టార్గెట్ చేస్తాడు. అతనితో పోట్లాడుతాడు.. ఫైనల్ గా అజయ్ ఫ్యామిలీకి అజయ్ కృష్ణ వారి సమస్యలను ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

పటాస్ నుండి ఎఫ్-2 వరకు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన అనీల్ రావిపుడి సూపర్ స్టార్ మహేష్ తో చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ హీరోయిజం చూపించిన డైరక్టర్ ట్రైన్ ఎపిసోడ్ తో టైం పాస్ చేశాడు. ఇంటర్వల్ లో ఓ ఫైట్ తో మంచి బ్రేక్ ఇచ్చాడు. 

ఇక సెకండ్ హాఫ్ మొత్తం మహేష్ అదరగొట్టేశాడు. మినిస్టర్ నాగేంద్రతో అజయ్ కృష్ణ చేసే కొట్లాట.. అతనికి వార్నింగులు ఇవ్వడం లాంటివి సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. సినిమాలో మహేష్ తన క్యారక్టర్ లో అదరగొట్టేసాడు. అనీల్ మార్క్ కామెడీ.. మహేష్ మార్క్ యాక్షన్ సీన్స్ ఇలా అన్ని కుదిరి సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. 

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అందరు పండుగ చేసుకునేలా ఈ సినిమా ఉంది. పక్కా పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు. సినిమాలో కొన్ని వావ్ ఫ్యాక్టర్స్ సిని ప్రియులను అలరిస్తాయి. సంక్రాంతి బరిలో దిగిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఆశించిన స్థాయిలో ఉందని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

మహేష్ బాబు తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అజయ్ కృష్ణ రోల్ లో తన నట విశ్వరూపం చూపించాడు మహేష్. ఈ సినిమాలో మహేష్ డ్యాన్సుల విషయంలో కూడా కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. డ్యాంగ్ డ్యాంగ్ తో పాటుగా మైండ్ బ్లాక్ సాంగ్ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక సినిమాలో రష్మిక మందన్న పాత్ర కామెడీకే అంకితమైందని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్ విలనిజం ఎప్పటిలానే సూపర్ అనిపించింది. ఇక విజయశాంతి కూడా తన సహజ నటనతో ఆకట్టుకుంది. రావు రమేష్, సంగీత, అజయ్ ఇలా అందరు తమ పాత్రల్లో మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదరగొట్టాడు. బిజిఎం కూడా బాగుంది. మాస్ సినిమాకు కావాల్సిన మ్యూజిక్ ఇచ్చాడు దేవి. ఇక సినిమా కథ రొటీన్ గా అనిపించినా కథనంలో తన మార్క్ చూపించాడు అనీల్ రావిపుడి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

మహేష్ సరిలేరు నీకెవ్వరు.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి సినిమా..!

రేటింగ్ : 2.75/5

Related Post