వెంకీ మామ : రివ్యూ

December 13, 2019
img

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. కె.ఎస్ బాబి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

వెంకటరత్నం (వెంకటేష్)కు మేనళ్లుడు కార్తిక్ (నాగ చైతన్య) అంటే ప్రాణం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన కార్తిక్ కు అన్ని తానై ఉంటాడు వెంకటరత్నం. అల్లుడు కోసం వెకటరత్నం పెళ్లి కూడా చేసుకోడు. మరోపక్క మామయ్య కోసం తన లవ్ ను శాక్రిఫైజ్ చేస్తాడు కార్తిక్. ఇలా ఇద్దరు ఒకరికోసం ఒకరు తమ లైఫ్ ను  త్యాగం చేస్తారు. ఇలాంటి టైంలో లోకల్ ఎమ్మెల్యేతో వెంకటర్నం గొడవ పడటం అతనికి ప్రాణమైన కార్తిక్ ను చంపేయాలని ప్లాన్ చేస్తారు. ఇదిలాఉంటే కార్తిక్ వల్ల ఎప్పటికైనా వెంకటరత్నం ప్రాణానికి ప్రమాదమని హెచ్చరిస్తారు వెంకటరత్నం తండ్రి. ఇలా జరుగుతున్న టైంలో వెంకటరత్నం ను వదిలిపెట్టి కార్తిక్ దూరంగా వెళ్తాడు. ఇంతకీ కార్తిక్ ఎక్కడికి వెళ్లాడు..? అతన్ని వెతుక్కుంటూ వెంకటరత్నం ఎలాంటి రిస్క్ చేశాడు..? మామా అల్లుళ్లు కలిసి చేసిన హంగామా ఏంటన్నది సినిమా చూస్తే అర్ధమవుతుంది. 

విశ్లేషణ :

వెంకీమామ సినిమా చూస్తే ఇదివరకు ఎప్పుడో చూసిన సినిమాగా అనిపిస్తుంది. వెంకటేష్, చైతు ఆన్ స్క్రీన్ మామా అల్లుళ్లుగా అదరగొట్టారు. అయితే వీరిద్దరి ఎనర్జీకి సరిపడా స్క్రిప్ట్ ఇది కాదని చెప్పొచ్చు. వెంకటర్నం ఫాదర్ జాతకాలు నమ్మడం.. కార్తిక్ వల్ల వెంకటర్నంకు ప్రాణాహాని ఉందని తెలవడం. అందుకే అతన్ని దూరంగా పంపించాలని చెప్పడం ఇదంతా సినిమాలో బాగుంటాయి అన్నట్టుగా ఉంటుంది.

అంతేకాదు సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే స్పీడ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ కొద్దిగా ప్రెజెంట్ ఇలా చేసేసరికి కన్ ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇక క్లైమాక్స్ కూడా అందరు ఊహించేలా ఉంటుంది. మామా అల్లుళ్ల మధ్య ఎమోషన్ బాగా చూపించారు. కాని రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలానే ఉంది తప్ప కొత్తగా ఏమి అనిపించదు.

సినిమాలో వెంకటేష్ ఎనర్జీ సూపర్ అనిపిస్తుంది. ఎఫ్ 2 తర్వాత వెంకటేష్ మళ్లీ తన మార్క్ సినిమాతో వచ్చాడని చెప్పొచ్చు. వెంకటేష్, నాగ చైతన్యలను దర్శకుడు బాగా వాడుకున్నాడు. రాశి, పాయల్ రాజ్ పుత్ ల గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే సినిమా బి,సి సెంటర్స్ లో బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా నచ్చుతారు. వెరైటీ సినిమాలు కావాలనుకునే వారికి వెంకీమామ నచ్చకపోవచ్చు.

నటన, సాంకేతిక వర్గం :

వెంకటరత్నం పాత్రలో వెంకటేష్ మళ్లీ అదరగొట్టేశాడు. ఒకప్పటి వెంకటేష్ ఎనర్జీ మళ్లీ ఈ సినిమాలో కనిపించింది. ఎఫ్ 2 ముందు వరకు సీరియస్ సబ్జెక్టులను చేస్తూ వచ్చిన వెంకటేష్ ఎఫ్ 2తో వింటేజ్ వెంకటేష్ ను పరిచయం చేశాడు. ఇక ఈ సినిమాతో మరోసారి దుమ్ముదులిపేశాడు వెంకీ. నాగ చైతన్య కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ ల నటన బాగుంది. ప్రకాశ్ రాజ్, రావు రమేష్, దాసరి అరుణ్ కుమార్ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కెమెరా వర్క్ మంచి మార్కులు పడ్డాయి. థమన్ మ్యూజిక్ సోసోగానే ఉంది. బిజిఎం వర్క్ అవుట్ అయ్యింది. కథ, కథనాల్లో దర్శకుడు బాబి ప్రతిభ కనబరచలేదు. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చాడు. సురేష్ బాబు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

వెంకీమామ.. మామా అళ్లుళ్లు సందడి బాగుంది కాని..!

రేటింగ్ : 2.5/5



Related Post