ఖైది : రివ్యూ

October 25, 2019
img

కోలీవుడ్ హీరో అయినా సరే తెలుగులో సూర్యలానే కొంత మార్కెట్ ఏర్పరచుకున్నాడు తమిళ హీరో కార్తి. అతను నటించిన ఆవారా, నా పేరు శివ, కాష్మోరా, ఊపిరి ఇలా అన్ని సినిమాలు ఇక్కడ మంచి ఫలితాలు తెచ్చాయి. ఈమధ్య తమిళ సినిమాలేవి తెలుగు బాక్సాఫీస్ పై ప్రభావం చూపించట్లేదు. అయినా సరే కార్తి సినిమా చేస్తే తెలుగు వర్షన్ లో తప్పకుండా రిలీజ్ చేస్తున్నాడు. దేవ్ అంటూ వచ్చి నిరాశపరచిన కార్తి లేటెస్ట్ గా ఖైదిగా వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఎస్.ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్ ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించారు. ఈ మూవీని తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె.కె రాధామోహన్ రిలీజ్ చేశారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి ఖైది ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ : 

ఓ కేసు విషయంలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఢిల్లి బాబు (కార్తి) పదేళ్ల తర్వాత అతని సత్ ప్రవర్తన వల్ల జైలు నుండి రిలీజ్ చేస్తారు. ఈ టైంలో పోలీసుల దగ్గర ఉన్న 800 కోట్ల స్మగుల్ గూడ్స్ ను కాజేసిన ఓ బ్యాచ్ గురించి తెలుస్తుంది. అలాంటి టైంలో ఢిల్లి హెల్ప్ తీసుకుంటారు పోలీసులు. ఇంతకీ ఢిల్లి బాబు పోలీసులకు ఎలా హెల్ప్ చేశాడు..? ఆ రౌడీ గ్యాంగ్ ను ఢిల్లి ఎలా ఢీ కొట్టాడు..? ఢిల్లి బాబు గమ్యం ఎటు వైపు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ :

కేవలం కొద్ది గంటల్లో జరిగే కథగా ఖైది సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ కథకు అవసరం లేనిదేది ప్రస్థావించలేదు. సినిమాలో హీరోయిన్, సాంగ్స్, రొమాన్స్ లేదంటేనే ఇది ఎలాంటి జానర్ సినిమానో అర్ధం చేసుకోవచ్చు. సినిమా మొదలైన దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడు.

ఇక సినిమాలో కార్తి నటన మరో హైలెట్ అని చెప్పొచ్చు. రౌడీల పాలిట యముడిగా ఉంటూ.. తన కూతురు గుర్తుకొచ్చిన సమయాల్లో ఎమోషనల్ గా అలరించాడు. దర్శకుడు రాసుకున్న కథను అదే విధంగా థ్రిల్లింగ్ అంశాలతో కథనం ఏర్పరచుకున్నాడు. ఎక్కడ సినిమాకు సంబంధం లేనివి బలవంతంగా చొప్పించాలని చూడలేదు. 

మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖైది సినిమా తమిళ ఆడియెన్స్ కే కాదు తెలుగు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్, సినిమాలో సాంగ్స్, రొమాన్స్ ఆశించే ఆడియెన్స్ కు ఇది నచ్చదు. ఫైనల్ గా కార్తి ఖైది మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.

నటన, సాంకేతిక వర్గం పనితీరు :

ఢిల్లి బాబు పాత్రలో కార్తి అదరగొట్టాడు. సినిమా మొత్తం కార్తి కనిపిస్తాడు. సినిమా కోసం అతను పడిన కష్టం కనిపిస్తుంది. ఇక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన నరైన్ బాగానే చేశాడు. అర్జున్ దాస్, రమణల  విలనిజం ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి. 

ఇక సాంకేతికవర్గం పనితీరు విషయానికి వస్తే.. సత్యన్ సూరియన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా అంతా రేసీగా ఉండటంతో కెమెరా వర్క్ కోసం చాలా కష్టపడ్డాడని అనిపిస్తుంది. సామ్ సిఎస్ మ్యూజిక్ బిజిఎం సినిమాకు హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ ఓకే.. దర్శకుడు లోకేష్ కథ పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. కథనం కూడా బాగా కుదిరింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.   

ఒక్కమాటలో :

'ఖైది' కార్తి సక్సెస్ కొట్టాడు..!

రేటింగ్ : 3/5

Related Post