సైరా నరసింహా రెడ్డి : రివ్యూ

October 02, 2019
img

రేటింగ్ : 3/5

కథ :

రేనాటి పాలెగాడుగా ఉన్న నరసింహా రెడ్డి ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని అనుకుంటాడు. చిన్ననాటి నుండే ఈ గడ్డ మనదన్న భావనతో ఉంటాడు. గురువు గోసాయి వెంకన్న చెప్పిన పాఠాలతో పాటుగా అన్ని విద్యల్లో ఆరితేరుతాడు. రాజ్య ప్రజలు కరువు కష్టాల్లో ఉన్నప్పుడు శిస్తు కోసం వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగిని ఎదురించి పంపుతాడు. అలా మొదటిసారి బ్రిటీష్ పాలకులను భయపెట్టిన నరసింహా రెడ్డి. భూమి మనది.. కష్టం మనది.. అలాంటప్పుడు పన్ను ఎందుకు కట్టాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తిరుగుబాటు మొదలవుతుంది. అది దేశ సమగ్రతకు, స్వేచ్చకు దారి తీస్తుంది. ఏ కథ అయినా మరణంతో ముగుస్తుంది.. కాని స్వతంత్ర ఆకాంక్ష ప్రజల్లో కలిగించేలా నరసింహా రెడ్డి మరణం జరుగుతుంది.        

విశ్లేషణ :

చారిత్రత్మిక కథలను తెర మీదకు చూపించే విధానంలో దర్శకుడి ప్రతిభ చాలా చూపించాల్సి ఉంటుంది. బాహుబలి తరహాలో అవసరమైన సన్నివేశాల్లో గ్రిప్పింగ్ తో స్క్రీన్ ప్లే రాసుకోవాలి. ఆ విషయంలో సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా అదరగొట్టాడని చెప్పొచ్చు. సినిమాలో ఇంటర్వల్ బ్లాక్, క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టు.

ఇక నరసింహా రెడ్డిగా చిరంజీవి అద్భుత నటన సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఎంచుకున్న పాత్రకు ఇంతగా న్యాయం చేయడం చిరంజీవి వల్లే అవుతుందని చెప్పొచ్చు. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్స్, లొకేషన్స్, భారీతనం అంతా సూపర్ గా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ప్రేక్షకుడిని అబ్బురపరుస్తాయి.     

భరతజాతి స్వతంత్ర ఆకాంక్షను గొంతెత్తి చాటిన రేనాటి వీరుడు నరసింహా రెడ్డి జీవిత కథను చాలా చక్కగా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. సినిమాలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా పండుగ చేసుకునేలా ఉందని చెప్పొచ్చు. సగటు సిని ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంది.    

నటన, సాంకేతిక వర్గం :   

నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి అభినయం బాగుంది. ఓ విధంగా చిరంజీవి నటన విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. వయసు 60 ఏళ్లు దాటినా చిరు ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీన్స్ ఔరా అనిపించేలా ఉన్నాయి. ఇక పతాక సన్నివేశాల్లో తన ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి అలా కనిపించేలా చేయడం ఓ సాహసమే అని చెప్పొచ్చు. సినిమాలో గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ బాగా చేశారు. నయనతార, తమన్నాలు కూడా తమ నటనతో మెప్పించారు. సుదీప్, విజయ్ సేతుపతి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్ని పరిది మేరకు నటించి మెప్పించాయి. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. అమిత్ త్రివేది మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. బిజిఎం కూడా మెప్పించాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేం చాలా రిచ్ గా ఉంది. నిర్మాతగా రాం చరణ్ కు 100 మార్కులు వేసేయొచ్చు. దర్శకుడు సురేందర్ రెడ్డి తన డైరక్షన్ టాలెంట్ తో మెప్పించాడు. 

ఒక్కమాటలో :

సైరా నరసింహా రెడ్డి.. మెగాస్టార్ మెగా ట్రీట్ ఫర్ ఫ్యాన్స్..!


Related Post