రాక్షసుడు : రివ్యూ

August 02, 2019
img

రేటింగ్ : 2.5/5

కథ :

డైరక్టర్ అవ్వాలనే కలతో తన దగ్గర ఉన్న హర్రర్ కథతో స్టూడియోల చుట్టూ తిరుగుతాడు అరుణ్ (బెల్లకొండ శ్రీనివాస్). అయితే అతను దర్శకుడి కాకుండా పోలీస్ అవ్వాల్సి వస్తుంది. అప్పటికే సైకో కిల్లర్ సిటీలో స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తుంటే.. ఆ కేసు టేకప్ చేసిన అరుణ్ కుమార్ ఆ సైకో కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు..? ఆ కిల్లర్ ను పట్టుకునేందుకు అరుణ్ తన దర్శకత్వ ప్రతిభను ఎలా వాడుకున్నాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

తమిళంలో సూపర్ హిట్టైన రాక్షసన్ సినిమాకు అఫిషియల్ రీమేక్ గా వచ్చిన సినిమా రాక్షసుడు. రమేష్ వర్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళ సినిమాను మక్కీకి మక్కీ దించాడని చెప్పొచ్చు. అయితే తమిళ సినిమాలో ఉన్న సస్పెన్స్ ను తెలుగులో మెయింటైన్ చేయలేదు. థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సింది ఆ సస్పెన్సే.. కాని రమేష్ వర్మ ఆ విషయంలోనే తడపడ్డాడు.

ఫస్ట్ హాఫ్ అంతా ఓకే అనిపించేలా నడిపించగా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంటర్వల్ సీన్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. డిఫరెంట్ సినిమాలు చూసే ఆడియెన్స్.. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. సినిమాకు కాస్ట్ అండ్ క్రూ చాలా ప్లస్ అయ్యింది.

సినిమా మొత్తం ఒకే పాట ఉండటం వల్ల లెంగ్తీగా అనిపిస్తుంది. అంతేకాదు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎక్కువ సాగదీసినట్టుగా ఉంటాయి. ఇప్పటికే రాక్షసన్ సినిమా తమిళ వర్షన్ చూసిన వారిక్ ఈ సినిమా నచ్చకపోవచ్చు. అది చూడని వారైతే ఒకసారి చూసే అవకాశం ఉంది.

నటన, సాకేతికవర్గం :

బెల్లంకొండ శ్రీనివాస్ అరుణ్ పాత్రలో మెప్పించాడు. సినిమాలో శ్రీనివాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. నటనలో పరిణితి వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ చిన్న పాత్రకే పరిమితమైంది. రాజీవ్ కనకాల అలరించాడు. విలన్ గా చేసిన అతను కూడా సోసోగా చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. జిబ్రన్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బిజిఎం కూడా ఆకట్టుకుంది. వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన మూడ్ క్రియేట్ చేయడంలో కెమెరా మెన్ బాగా వర్క్ అవుట్ చేశాడు. రమేష్ వర్మ తమిళ సినిమాను డిటో దించేశాడు. టేకింగ్ వైజ్ ఓకే అనిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

బెల్లంకొండ 'రాక్షసుడు'.. కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే..! 


Related Post