ఇస్మార్ట్ శంకర్ : రివ్యూ

July 18, 2019
img

రేటింగ్ : 3/5

కథ :

పెయిడ్ కిల్లర్ గా చిన్న చిన్న సెటిలెమెంట్స్ చేస్తూ ఉండే ఉస్తాద్ శంకర్ (రామ్) ఓ మాజీ సిఎం కేసులో జైలు వెళ్తాడు. అయితే అక్కడ నుండి తప్పించుకున్న శంకర్ తనని జైలుకి పంపించిన వాడి కోసం వేట మొదలుపెడతాడు. మరో పక్క పోలీస్ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) ఓ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా అతన్ని చంపేస్తారు. అయితే అతని మెమొరీలో కొంత సమాచారం ఉందని తెలుసుకున్న పోలీసులు. డాక్టర్స్ సాయంతో అతని మెమొరీని ఓ చిప్ రూపంలో మార్చి శంకర్ తలలో పెట్టేస్తారు. ఇంతకీ అరుణ్ ఆపరేషన్ ఏంటి..? దానికి శంకర్ ఎలా సహాయపడ్డాడు..? ఎలా ఆపరేషన్ క్లోజ్ చేశాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని పూరి బౌన్స్ బ్యాక్ అయ్యేలా తీసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. తనలో కసి అలానే ఉందని ప్రూవ్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ కథ రొటీన్ గానే ఉన్నా కథనంలో తన ప్లస్సులన్నిటిని పర్ఫెక్ట్ ఎక్స్ క్యూట్ చేశాడు పూరి. ముఖ్యంగా హీరో క్యారక్టరైజేషన్, టేకింగ్, డైలాగ్స్ ఇవన్ని సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు.

పూర్తి మాస్ మసాలా సినిమా చూసి చాన్నాళ్లయ్యింది అనుకునే ప్రేక్షకులకు పర్ఫెక్ట్ మాస్ మూవీగా ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. యూత్, మాస్ ఆడియెన్స్ అందరిని ఈ సినిమా మెప్పిస్తుంది. కేవలం బి, సి మాత్రమే కాదు ఏ సెంటర్ ఆడియెన్స్ కూడా అదుర్స్ అనేలా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగా రాసుకున్న పూరి సెకండ్ హాఫ్ కాస్త ప్రిడిక్టబుల్ గా నడిపించాడు. 

ఇక సినిమాలో లాజిక్స్ చూడటం వేస్ట్.. పక్కా మాస్ మసాలా మూవీగా ముందునుండి ప్రమోట్ అవుతున్న ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కొద్దిగా నిరాశపరచే అవకాశం ఉంది.

నటన, సాంకేతికవర్గం : 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎనర్జీకి పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ ఈ ఇస్మార్ట్ శంకర్. తనకు సరిపడే కథ రావాలే కాని తానేంటో ప్రూవ్ చేసుకుంటా అని రామ్ కసితో ఈ సినిమాలో నటించాడని చెప్పొచ్చు. ఇక హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ ఇద్దరు గ్లామర్ షోకి పరిమితమయ్యారు. నిధి అగర్వాల్ కన్నా నభాకు ఎక్కువ స్కోప్ దొరికినట్టు ఉంది. ఇక సత్యదేవ్ కు మంచి పాత్ర దొరికింది. షియాజి శిండే కూడా మెప్పించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. రామ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. మణిశర్మ మ్యూజిక్ కూడా బాగుంది. ముఖ్యంగా బిజిఎం అదరగొట్టాడు. కథ అంత గొప్పగా లేకున్నా కథనంలో పూరి తన మార్క్ చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ఒక్కమాటలో :  

పూరి మార్క్ ఇస్మార్ట్ శంకర్.. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్..!  


Related Post