నిను వీడని నీడను నేనే : రివ్యూ

July 12, 2019
img

రేటింగ్ : 2.5/5

కథ :

రిషి (సందీప్ కిషన్), దియా (అన్య సింగ్) ఇద్దరు భార్యా భర్తలు. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో ఒక సందర్భంలో వీరి కారుకి యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఆ యాక్సిడెంట్ తర్వాత వీళ్లల్లో మార్పు వస్తుంది. అద్దంలో వీరి బదులు మరొకరు కనిపిస్తారు. అప్పుడు వీరు డాక్టర్ మురళి శర్మను కలుస్తారు. అతను చెప్పడం వల్ల ఓ చర్చి ఫాదర్ దగ్గరకు వెళ్తారు. అతను వీరికిలా జరగడానికి 400 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనకు సంబంధం ఉందని తెలుసుకుంటాడు. ఇంతకీ రిషి, దియాలకు ఏమైంది..? వాళ్లు ఎందుకలా కనిపిస్తారు..? వారు ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డారు అన్నదు సినిమా కథ.

విశ్లేషణ :

తెలుగు ఆడియెన్స్ కు కొత్త థ్రిల్ అందించాలనే ఆలోచనతో సందీప్ కిషన్ నిను వీడని నీడను నేనే కథతో వచ్చాడు. ఈ సినిమాలో కేవలం హీరోగానే కాదు నిర్మాతగా కూడా అవతారం ఎత్తాడు. కార్తిక్ రాజు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ కొత్తగా ఉంది. అయితే కథనం అదే పంథాలో సాగించలేదు.

సినిమా లో ఫస్ట్ 30 మినిట్స్ బాగుంటుంది.. ఇంటర్వల్ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తుంది.. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా మొదలు పెట్టడం బాగానే మొదలు పెడతాడు ఆ తర్వాత కొద్దిగా లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. అంతేకాదు సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫైనల్ గా క్లైమాక్స్ లో మళ్లీ గ్రిప్పింగ్ తో చేశారు. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే సినిమా ఫలితం ఇంకాస్త మెరుగ్గా ఉండేది.

ఇక ఈ సినిమా పక్కాగా హర్రర్ థ్రిల్లర్ జానర్ సినిమాలను చూసే ఆడియెన్స్ కే నచ్చుతుంది. కామెడీ, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే అవకాశం లేదు. కొత్త సినిమా కావాలనుకునే ఆడియెన్స్ కు థ్రిల్ అయ్యేలా చేస్తుంది. అయితే కథంలో చిన్న చిన పొరపాట్లు వల్ల అప్ టు ది మార్క్ అనిపించలేదు.

నటన, సాంకేతికవర్గం :

సందీప్ కిషన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశాడనిపిస్తుంది. హీరోగానే కాదు నిర్మాతగా కూడా సందీప్ కష్టపడ్డాడు. హీరోయిన్ అన్య సింగ్ కూడా ఇంప్రెస్ చేసింది. ఆమె రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది. ఇక సినిమాలో నటించిన పోసాని, వెన్నెల కిశోర్, మురళి శర్మ వీళ్లంతా పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. 

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. తమన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. సాంగ్స్ జస్ట్ ఓకే. పికే వర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అని చెప్పొచ్చు. కెమెరా వర్క్ ద్వారా థ్రిల్లర్ అంశాలు బాగా చూపించారు. కార్తిక్ రాజు డైరక్షన్ పరంగా ఓకే.. కథ ఇంప్రెస్ చేసేలా ఉన్నా కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే'.. కేవలం కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే..!


Related Post