ఓ బేబీ : రివ్యూ

July 05, 2019
img

రేటింగ్ : 2.75/5

కథ : 

70 ఏళ్ల వయసు గల బేబీ అలియాస్ సావిత్రి (లక్ష్మి) ఆర్మీ ఆఫీసర్ అడివి శేష్ ను ప్రేమించి పెళ్లాడుతుంది. యుద్ధంలో భర్తను పోగొట్టుకున్న బేబీ ఒక్కతే చిన్న పిల్లాడుతో జీవితాన్ని నెట్టుకుంటూ వస్తుంది. జీవితమంతా కష్టాలు పడిన బేబీ ఒక్కసారి తన జీవితం మళ్లీ తన చేతుల్లోకి వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటుంది. ఈలోగా ఓ స్వామి వేశంలో వచ్చిన జగపతి బాబు బేబీ చేతిలో ఓ చిన్న వినాయకుడి విగ్రహం పెట్టి వెళ్లిపోతాడు. తీరా చూస్తే 70 ఏళ్ల బేబీ కాస్త 24 ఏళ్ల పడుచు పిల్లగా మరుతుంది. మారిన బేబీ స్వాతి (సమంత)గా రూపం ధరించినా ఆమె ప్రవర్తన అంతా పాత కాలం మనిషిలానే ఉంటాయి. ఈ క్రమంలో మనవడు రాకీ (తేజ) మ్యూజిక్ ట్రూప్ లో జాయిన్ అవుతుంది స్వాతి. అతని గోల్ రీచ్ అయ్యేందుకు ఆమె సపోర్ట్ చేస్తుంది. మ్యూజిక్ ఛానెల్ లో కో ఆర్డినేటర్ విక్రం (నాగ శౌర్య) స్వాతికి దగ్గరవుతాడు. అయితే తనకు తిరిగి వచ్చిన ఈ జీవితం కన్నా తన భారం అనుకున్న ఆ జీవితమే బెటర్ అనుకుంటుంది బేబీ. ఇంతకీ బేబీ కథ ఎలా సాగింది అన్నది సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ :

కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమాకు అఫిషియల్ రీమేక్ గా ఓ బేబీ వచ్చింది. ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా నడిపించగా సెకండ్ హాఫ్ కాస్త సెంటిమెంట్ ఎక్కువైందని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లోనే సినిమా స్క్రీన్ ప్లే కూడా కాస్త సాగదీతగా అనిపిస్తుంది.

మిస్ గ్రానీని తెలుగు సినిమాకు కావాల్సినట్టుగా మార్చిన విధానం బాగున్నా కేవలం సమంత నటన మీదనే సినిమా మొత్తం నడిపించి మిగతా అంతా సప్పగా చేశారు. సినిమాలో సమంత పాత్ర హైలెట్ గా నిలవగా సపోర్టింగ్ గా చేసిన కనకరాజు అలియాస్ చంటి పాత్ర చేసిన రాజేంద్ర ప్రసాద్ కూడా ఆకట్టుకున్నాడు. 

సమంత, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి కనిపించిన ప్రతిసారి ఫన్ జెనరేట్ అవుతుంది. అయితే సినిమా అక్కడక్కడ స్లో అనిపించడం కథకు కావాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా అంత బాగా ఏం అనిపించలేదు. యూత్, మాస్ ఆడియెన్స్ కు అసలు ఈ సినిమా నచ్చదు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు మెచ్చేలా ఉంది.

నటన, సాంకేతిక వర్గం :

బేబీ పాత్రలో సమంత, లక్ష్మి ఇద్దరు అదరగొట్టారు. ముఖ్యంగా 70 ఏళ్ల వయసు గల బామ్మ చాదస్తాన్ని సమంత తన నటనలో చూపించిన విధానం సూపర్. ఓ విధంగా చెప్పాలంటే సమంత నటన కోసమే ఈ సినిమా చూడొచ్చు. ఇక సీనియర్ నటి లక్ష్మి కూడా మరోసారి తన నటనా ప్రతిభ చాటారు. రాజేంద్ర ప్రసాద్ కూడా మరో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రావు రమేష్, నాగ శౌర్య, తేజ ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు. చివర్లో నాగ చైతన్య సర్ ప్రైజ్ చేస్తాడు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ చాలా ప్లస్ అయ్యింది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. సినిమాలో సాంగ్స్ ఏమాత్రం మెప్పించలేదు. బిజిఎం కూడా సోసోగానే ఉంది. లక్ష్మి భూపాల్ డైలాగ్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వ ప్రతిభ చాటుకున్నా స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్తగా రాసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

సమంత ఓ బేబీ.. ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్..!



Related Post