చిత్రలహరి రివ్యూ & రేటింగ్

April 12, 2019
img

రేటింగ్ : 2.5/5

కథ :

చిన్నప్పటి నుండి ప్రయోగాలు చేస్తూ వచ్చే విజయ్ కృష్ణ (సాయి తేజ్) ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసి ఖాళీగా ఉంటాడు. తను అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్న విజయ్.. లహరి (కళ్యాణి ప్రియదర్శన్) తో ప్రేమలో పడతాడు. అయితే లహరికి తన ప్రేమ మీద నమ్మకాన్ని మాత్రం కలిగించలేకపోతాడు. ఈలోగా ప్రాజెక్ట్ అని చెప్పి టివి మెకానిక్ గా చేస్తున్నాడని తెలిసి లహరి విజయ్ కు దూరమవుతుంది. ఈ టైంలో విజయ్ ప్రాజెక్ట్ నచ్చి స్వేచ్చ (నివేదా పేతురాజ్) అతనికి హెల్ప్ చేస్తుంది. ఫైనల్ గా విజయ్ తన ప్రాజెక్ట్ ను సక్సెస్ చేసుకోవడం కోసం అతనేం చేశాడు..? విజయ్, లహరిల ప్రేమ గెలిచిందా..? విజయ్ కెరియర్ లో సక్సెస్ అందుకున్నాడా లేదా అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

లైఫ్ లో సక్సెస్ అంటే ఏంటో తెలియని ఓ వ్యక్తి.. ప్రేమించే అమ్మాయికి తన మీద నమ్మకం కలిగేలా చేయలేడు.. ఓ పక్క తను చేస్తున్న ప్రాజెక్ట్ తో ప్రపంచానికి తన సత్తా చాటాలని అనుకుంటాడు. ఇదే చిత్రలహరి కథ.. కాని దర్శకుడు చెప్పాలనుకున్న ఈ కథను ఏదో చేద్దామనుకుని ఏదో చేశాడనిపిస్తుంది.

సినిమా అంతా రొటీన్ పంథాలో సాగుతుంది.. అసలు ఏమాత్రం కొత్తదనం లేకుండా కథనం సాగించాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ చాలా వీక్ గా ఉంది. అక్కడక్కడ కళ్యాణి ప్రియదర్శన్ లుక్స్ ఆకట్టుకున్నాయి. నివేదా పేతురాజ్ పాత్రకు ఓ క్లారిటీ లేదు. ఫైనల్ గా మాత్రం కెరియర్ లో తను అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ చేసుకుంటాడు.

దర్శకుడు ఎంచుకున్న కథను ట్రీట్ మెంట్ సరిగా చేయలేదు. స్క్రీన్ ప్లే చాలా పొరపాట్లు చేశారు. సాయి తేజ్ నటన, కొన్ని సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను కాస్త నిలబెట్టాయి. తప్పకుండా మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. యూత్ ఆడియెన్స్ సినిమాలోని డైలాగ్స్ కు బాగా కనెక్ట్ అవుతారు.

నటన, సాంకేతిక వర్గం :

సాయి తేజ్ విజయ్ పాత్రలో బాగానే మెప్పించాడు. లుక్ విషయంలో కూడా సాయి తేజ్ కొత్తగా కనిపించాడు. కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. నివేదా పేతురాజ్ పాత్ర బాగుంది కాని దర్శకుడు ఆమె పాత్రను ఇంకాస్త బాగా రాసుకుని ఉండాల్సింది. పోసాని, రావు రమేష్, హైపర్ ఆది, సుదర్శన్ ఇలా అందరు బాగానే చేశారు. సునీల్, వెన్నెల కిశోర్ పాత్రలు కొద్దిగా కామెడీ పంచాయి.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కథ, కథనాల్లో దర్శకుడు రొటీన్ పంథా కొనసాగించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఒక్కమాటలో :

సాయి తేజ్ చిత్రలహరి.. జస్ట్ ఓకే..!


Related Post