లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ & రేటింగ్

March 29, 2019
img

రేటింగ్ : 2.5/5

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తీయగా లేటెస్ట్ గా ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటీ ఆర్జివి అసలు కథ చెప్పేందుకు ప్రయత్నించాడు. ఏపిలో రిలీజ్ కాకుండా అడ్డుకోగా ఆంధ్రప్రదేశ్ లో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.  

కథ :

1989లో సినిమా మొదలవుతుంది.. ఎన్.టి.ఆర్ బయోగ్రఫీ రాసేందుకు లక్ష్మీ పార్వతి ఎన్.టి.ఆర్ దగ్గరకు వస్తుంది. బయోపిక్ రాసే క్రమంలో ఆయనకు దగ్గరవుతుంది. నందమూరి ఫ్యామిలీతో కలిసి చంద్రబాబు ఎన్.టి.ఆర్ నుండి లక్ష్మీ పార్వతిని దూరం చేయాలని చూస్తారు. 1994 ఎన్నికల్లో టిడిపి విజయం వెనుక లక్ష్మీ పార్వతి పాత్ర ఉందని ఎన్.టి.ఆర్ నమ్ముతాడు. అయితే 1994లో వైశ్రాయ్ ఘటనతో చంద్రబాబు ఎన్.టి.ఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన్ను గద్దె దించి బాబు గద్దె ఎక్కుతాడు. ఆ మానసిక క్షోభతో ఎన్.టి.ఆర్ చనిపోతారు. ఎన్.టి.ఆర్ చనిపోవడంతో సినిమా ముగుస్తుంది.

విశ్లేషణ :

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ తీసిన రెండు పార్టులు ఫెయిల్ అయ్యాయి. అయితే ఎన్.టి.ఆర్ జీవితంలోని అసలు కథను చెబుతానని ఆర్జివి ముందునుండి చెబుతున్నాడు. ఎన్.టి.ఆర్ లక్ష్మీ పార్వతికి దగ్గరవడం నుండి సినిమా మొదలవుతుంది. సినిమా మొదటి భాగం మొత్తం ఎన్.టి.ఆర్, లక్ష్మీ పార్వతి మధ్య సీన్స్ ఎక్కువగా నడుస్తాయి. 

సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం పొలిటికల్ గా నడిపించారు. వైశ్రాయ్ హోటల్ సీన్ మాత్రం సినిమా ఏ ఉద్దేశంతో తీశారో దానికి న్యాయం జరిగేలా చేశారు. చంద్రబాబు అసలు స్వరూపం బయటపెట్టే ప్రయత్నంగా వచ్చిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అందులో సక్సెస్ అయినట్టే. అయితే లక్ష్మీ పార్వతి కేవలం ఎన్.టి.ఆర్ ను అభిమానించే వ్యక్తిగానే చూపించారు. అసలు ఆమె రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు అన్నట్టుగా చెప్పాడు. 

సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్ గా సాగుతాయి. ఎన్.టి.ఆర్ సిన్సియర్ ఫ్యాన్స్ ఈ సినిమా చూసి ఎన్.టి.ఆర్ కు జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ చేసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఆ విషయంలో సక్సెస్ అయినట్టే.

నటన, సాంకేతికవర్గం :

ఎన్.టి.ఆర్ పాత్రలో నటించిన విజయ్ కుమార్ బాగా చేశాడు. అయితే కొన్ని యాంగిల్స్ లో అతను ఎన్.టి.ఆర్ లా ఉన్నా కొన్ని యాంగిల్స్ లో మాత్రం ఎన్.టి.ఆర్ గా కనిపించలేదు. చంద్రబాబుగా శ్రీ తేజ్ అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక లక్ష్మీ పార్వతిగా నటించిన యజ్ఞా శెట్టి కూడా ఆమె పాత్రకు న్యాయం చేసింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. రమ్మీ సినిమాటోగ్రఫీ బాగుంది. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. కెమెరా వర్క్ లో వర్మ తన స్టైల్ చూపించాడు. దాదాపు 70 శాతం వరకు సీన్స్ క్లోజ్ యాంగిల్ లో ఉంటాయి. రాం గోపాల్ వర్మ తను చెప్పాలనుకున్న కథను బాగానే చెప్పాడు. స్క్రీన్ ప్లే మొదటి భాగన్ కాస్త స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుంది. నిర్మాత రాకేష్ రెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేశారు.

ఒక్కమాటలో :

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.. ఆర్జివి చెప్పినట్టే తీసి చూపించాడు.


Related Post