లవర్స్ డే రివ్యూ & రేటింగ్

February 14, 2019
img

రేటింగ్ : 2/5

కథ :

రోషన్, ప్రియా ప్రకాశ్ ఇద్దరు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతారు. మొదటి చూపులోనే రోషన్ ప్రియాకు కనెక్ట్ అవుతాడు. ఆమె కనుసైగలకు పడిపోయిన రోషన్ ఆమెకు తన ప్రేమను ముద్దు ద్వారా తెలియచేస్తాడు. అయితే ఇద్దరు ప్రేమించుకునే టైంలో రోషన్ నుండి ప్రియా దూరంగా వెళ్లిపోతుంది. వారిద్దరిని కలిపే టైంలో గాథ జాన్ (నూరిన్ షెరీఫ్) రోషన్ ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది. అయితే రోషన్, గాథ జాన్ ఇద్దరు నిజంగానే ప్రేమించుకుంటారు. అయితే ఫైనల్ గా రోషన్ ఎవరిని ప్రేమించాడు..? ప్రియా ఎందుకు అతనికి దూరమైంది..? అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ఏమాత్రం కొత్తదనం లేని ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథగా వింటే బాగుందనిపిస్తుంది. కాని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. రొటీన్ కథ, కథనాలతో సినిమా నిరాశపరుస్తుంది. ప్రియా ప్రకాశ్ కనుసైగలే కాదు మరో హీరోయిన్ నూరిన్ షెరీఫ్ కూడా ఆకట్టుకుంది. అయితే సినిమాలో ఆమె పాత్రే కీలకం అనేట్టుగా కొద్ది సీన్స్ వస్తాయి.

ప్రియా, రోషన్ ల మధ్య లవ్ సీన్స్ అంతగా మెప్పించలేదు. మరో హీరోయిన్ తో సీన్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వాలెంటైన్స్ డే నాడు వచ్చిన ఈ లవర్స్ డే సినిమా రొటీన్ కథ, కథనాలతోనే వచ్చిందని.. ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. ప్రియా, నూరిన్ షెరీఫ్ ల కోసం సినిమా చూసేయొచ్చు.

నటన, సాంకేతిక వర్గం :

రోషన్ ఎప్పుడు నవ్వుతూ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అయితే అక్కడక్కడ ఆకట్టుకున్నాడు. ఇక ప్రియా ప్రకాశ్ అయితే మెప్పించింది. ఆమెకు వచ్చిన ఫాలోయింగ్ కు సినిమాలో ఆమె పాత్ర నిడివి పెంచారని తెలుస్తుంది. ఇక మరో హీరోయిన్ నూరిన్ షెరీఫ్ కూడా ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రలన్ని ఆకట్టుకున్నాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. షాన్ రెహమాన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఉమర్ లులు కథ, కథనాలు పెద్దగా ఆకట్టుకోలేదు. కథ రొటీనే అయినా కథనం కొత్తగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక సినిమాకు తెలుగు డబ్బింగ్ అసలు కుదరలేదు. కార్టూన్ ఛానెల్ లో డబ్బింగ్ చెప్పినట్టుగా ఉంది. అసలేమాత్రం మ్యాచ్ అవలేదు. గురు రాజ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

లవర్స్ డే.. ప్రియా మ్యాజిక్ వర్క్ అవుట్ అవలేదు..!  Related Post