ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ & రేటింగ్

January 09, 2019
img

రేటింగ్ : 3.5/5

కథ :

ఎన్.టి.ఆర్ జీవిత కథగా నందమూరి బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా సొంత నిర్మాణంలో నటించారు. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈరోజు రిలీజైంది. ఎన్.టి.ఆర్ భార్య బసవతారకం క్యాన్సర్ తో బాధపడుతుండగా హరికృష్ణ ఆమె దగ్గర ఉంటాడు. అప్పుడు ఎన్.టి.ఆర్ గురించి ఆమె చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. రిజిస్ట్రార్ ఆఫీస్ లో జాబ్ వదులుకుని హీరో అవుదామని మద్రాస్ బయలుదేరుతాడు ఎన్.టి.ఆర్. ఇక అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి..? ఆయన సిని ప్రస్థానం ఎలా సాగింది..? అశేష అభిమాన జనంతో ఆయన ఎలాంటి టర్న్ తీసుకున్నారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ఎన్.టి.ఆర్ సినిమా రంగానికి చెందిన కథతో ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా తీశారు. బయోపిక్ లో మొదటి పార్ట్ గా వచ్చిన ఈ సినిమాలో పెద్దగా కథ లేదని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగం వదిలి వచ్చిన ఎన్.టి.ఆర్ సినిమా రంగంలో ఎలాంటి ప్రస్థానం కొనసాగించాడో అదే ఈ సినిమా. అయితే సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రలో బాలయ్య మొదటి బహగం అక్కడక్కడ కాస్త అటు ఇటుగా అనిపించాడు. 

కృష్ణుడిగా కనిపించే సీన్ లో మాత్రం అదరగొట్టేశాడు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఓల్డ్ ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ కూడా చాలా బాగా చేశారు. పతాక సన్నివేశాల్లో పార్టీని ఎనౌన్స్ చేసే టైం లో కూడా బాలకృష్ణ నటన బాగుంది. మహానటి స్పూర్తితో ఎన్.టి.ఆర్ బయోపిక్ ను కూడా ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. క్రిష్ కథ, కథనాల్లో తన మ్యాజిక్ చూపించాడు. 

అయితే మొదటి పార్ట్ లో ఎన్.టి.ఆర్ సినిమాల హంగామా మాత్రమే ఉంటుంది. అంతేకాదు పెద్దగా కథ నడిచినట్టు అనిపించదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా లాస్ట్ అరగంట ఆయన పార్టీ పెట్టే ఆలోచనతో స్క్రీన్ ప్లే నడిపించారు. మొత్తానికి అనుకున్న విధంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ అద్భుతంగా అనిపించింది. నందమూరి అభిమానులకే కాదు సగటు సిని ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. 

నటన, సాంకేతిక వర్గం :

ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ నటించారు అనడం కన్నా జీవించేశారు అని చెప్పొచ్చు. సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. స్క్రీన్ టైం మొత్తం  ఏవో ఒకటి రెండు సీన్స్ తప్ప అంతా బాలకృష్ణ ఉన్నారు. బసవతారకం గా విద్యా బాలన్ అలరించింది. సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏయన్నార్ గా సుమంత్ కు ఎక్కువ రోల్ ఇచ్చారు. అక్కినేనిగా సుమంత్ అదరగొట్టాడు. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రాం తండ్రి పాత్రలో మెప్పించాడు. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా రెండు సీన్స్ కే పరిమితమయ్యాడు. అయితే ఈ పార్ట్ లో తనకు అంత ప్రాధాన్యత లేదు. మిగతా పాత్రలన్ని మంచి నటనతో మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పైచేసిన జ్ఞానశేఖర్ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. కీరవాణి మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. క్రిష్ డైరక్షన్ టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కథ, కథనాలు క్రిష్ మార్క్ కనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంతా పెట్టేశారు. సాయి మాధవ్ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

ఒక్కమాటలో :

ఎన్.టి.ఆర్ కథానాయకుడు.. ఎన్.టి.ఆర్ సిని ప్రస్థానానికి అద్భుతమైన దృశ్యరూపం.


Related Post