అంతరిక్షం రివ్యూ & రేటింగ్

December 21, 2018
img
రేటింగ్ : 2.75/5

కథ :

ఇండియన్ స్పేస్ సెంటర్ నుండి పంపించిన మిహిర శాటిలైట్ మధ్యలో ట్రాక్ తప్పడంతో ప్రపంచ కమ్యునికేషన్ వ్యవస్థ అంతమవుతుందని తెలుస్తుంది. దీనికోసం ఐదేళ్ల క్రితం స్పేస్ సెంటర్ లో పనిచేసి వెళ్లిన దేవ్ (వరుణ్ తేజ్)ను మళ్లీ పిలుస్తారు. దేవ్ ప్రయత్నించిన విప్రయాన్ విఫలమవడం జరుగుతుంది. మిహిర కోసం స్పేస్ లోకి వెళ్లిన దేవ్ విప్రయాన్ కోసం ప్రయత్నిస్తాడు. ఇంతకీ దేవ్ చేసిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందా..? దేవ్ అతని టీం స్పేస్ లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

తెలుగు సినిమాల స్థాయి పెరిగుతుంది. మూస కథలకు మంగళం పాడేసారని గత మూడు నాలుగేళ్ల నుండి చూస్తూనే ఉన్నాం. ఆ క్రమంలో లాస్ట్ ఇయర్ ఘాని అంటూ వచ్చి ఓ సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో హిట్ అందుకున్న సంకల్ప్ రెడ్డి మరోసారి అంతరిక్షం అంటూ గగనయాత్రలో ప్రయోగం చేశాడు. 

మొదటి తెలుగు స్పేస్ సినిమాగా అంతరిక్షం మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ, కథనం ప్రేక్షకులను మెప్పించాయి. ఫస్ట్ హాఫ్ బాగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ చేశాడని అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ బాగుందనిపించగా క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేస్తే బాగుండేది. తెలుగు తెర మీద చూడని అద్భుతం అంతరిక్షం. ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే మాత్రం ఈ సినిమా కచ్చితంగా మరో లెవల్ లో ఉండేది.  

నటన, సాంకేతికవర్గం :

దేవ్ గా వరుణ్ తేజ్ అదరగొట్టాడు అని చెప్పొచ్చు. తన ప్రతి సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న వరుణ్ తేజ్ అంతరిక్షం చేయడం కెరియర్ లో మరో స్థాయికి వెళ్లాడని చెప్పొచ్చు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి కూడా ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో నటించిన అవసరాల శ్రీనివాస్, రహమాన్, సత్యదేవ్, రాజులు అలరించారు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ బాగుంది. బిజిఎం కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాల్లో దర్శకుడు సంకల్ప్ రెడ్డి ప్రతిభ కనబరిచాడు.   

ఒక్కమాటలో :

అంతరిక్షం.. అద్భుతమే కాని..! 

Related Post