పడి పడి లేచే మనసు రివ్యూ & రేటింగ్

December 21, 2018
img

రేటింగ్ : 2/5

కథ :

కలకత్తాలో చదువు పూర్తి చేసి సరదాగా జీవితాన్ని గడుపుతున్న సూర్య (శర్వానంద్) సడెన్ గా మెడిసిన్ చేస్తున్న వైశాలి (సాయి పల్లవి)ని చూసి ఇష్టపడతాడు. ఆమెను ఎలాగైనా ప్రేమలో పడేయాలని ప్రయత్నించిన సూర్య ఫైనల్ గా ఆమె ప్రేమని పొందుతాడు. అంతా బాగుంది అనుకున్న టైంలో ఆమెతో పెళ్లికి నిరాకరిస్తాడు సూర్య. అదే వారి మధ్య దూరానికి కారణమవుతుంది. ఇంతకీ సూర్య ఎందుకు సడెన్ గా అలా మారాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏంటి అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

అందాల రాక్షసి సినిమాతోనే తన స్పెషాలిటీ ఏంటో చూపించిన దర్శకుడు హను రాఘవపుడి తన ప్రతి సినిమా లవ్ స్టోరీగానే తీశాడు. అయితే లవ్ సీన్స్ బాగా తీయగలిగిన హను మంచి కథను మాత్రం రాసుకోలేకపోతున్నాడు. పడి పడి లేచె మనసు సినిమాలో కూడా.. మొదటి భాగం వరకు అదరగొట్టిన హను సెకండ్ హాఫ్ చెడగొట్టాడు.

కన్ ఫ్లిక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా తేలగొట్టినట్టు అవుతుంది. లీడ్ పెయిర్ యాక్టింగ్ బాగుంది. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో వారు అదరగొట్టారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా రాగా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా శర్వానంద్, సాయి పల్లవిల కోసం ఓసారి చూసేయొచ్చు.

నటన, సాంకేతికవర్గం : 

శర్వానంద్ ఎప్పటిలానే ఈజ్ తో నటించాడు. సూర్య పాత్రకు శర్వా పర్ఫెక్ట్ అనిపించాడు. ఇక వైశాలిగా సాయి పల్లవి మెప్పించింది. మురళి శర్మ, సంపత్ లను సరిగా వాడుకోలేదు. ప్రియా రామన్, అజయ్ లు ఓకే అనిపించారు. ప్రియదర్శి కామెడీ కొద్దిగా నవ్వించగా సునీల్ ఉన్నా పెద్దగా ఉపయోగపడలేదు.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. బిజిఎం అదరగొట్టాడు. సినిమాటోగ్రఫర్ జేకే కలకత్తాలో అందమైన లొకేషన్స్ అన్నిటిని బాగా చూపించాడు. సినిమా నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు. హను రాఘవపుడి ఎప్పటిలానే తనకు మంచి పట్టున్న లవ్ సీన్స్ లో అదరగొట్టి సినిమాకు బలమైన కథాంశం మిస్ చేశాడు. 

ఒక్కమాటలో :

పడి పడి లేచే మనసు.. ఆశించినంతగా లేదు..!


 

Related Post