భైరవగీత రివ్యూ & రేటింగ్

December 14, 2018
img

రేటింగ్ : 1.5/5

కథ :

రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ అయిన సుబ్బా రెడ్డి (బాల్ రాజ్ వాడీ) కొందరిని తన బానిసలుగా ఉంచుకుంటాడు. వారిలో భైరవ (ధనుంజయ్) కుటుంబం తరాల వారిగా సుబ్బారి రెడ్డి కుటుంబానికి చాకిరీ చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే తనకంటే అన్నిట్లో ఎక్కువ ఉన్న కట్టా రెడ్డి (విజయ్ రాం)కు ఇచ్చి తన కూతురు గీత (ఇర్రా మోర్) పెళ్లి ఫిక్స్ చేస్తాడు సుబ్బా రెడ్డి. ఇంతలో మరో ట్విస్ట్ భైరవ, గీత ప్రేమించుకుంటారు. వీరిద్దరి ప్రేమ సుబ్బారెడ్డికి తెలిసేసరికి ఇద్దరు జంప్ అవుతారు. అయితే అప్పుడు సుబ్బా రెడ్డి భైరవ కుటుంబాన్ని, స్నేహితులను కిరాతకంగా చంపిచేస్తాడు. అలా చేసిన సుబ్బా రెడ్డికి భైరవ ఎలా బుద్ధి చెప్పాడు అన్నది సినిమా కథ.   

విశ్లేషణ :

వర్మ ప్రొడక్షన్ లో సినిమా అంటే అది అతని డైరక్షన్ అయినా కాకున్నా రక్తపాతం ఉండాల్సిందే. ఆర్జివి శిష్యుడు సిద్ధార్థ్ కూడా భైరవగీత విషయంలో వర్మ స్టైల్ ను ఫాలో అయ్యాడు. అయితే ఒకప్పుడు అంటే ఇలాంటి కథలకు సినిమాలకు కిక్ ఉండేది కాని వందల కొద్ది సినిమాలు ఇలాంటి కథతో రావడం వల్ల భైరవగీత కథ కొత్తగా అనిపించదు.

కథ రొటీనే కథనం అయినా ఏదైనా మ్యాజిక్ చేస్తాడా అంటే అదే వయిలెన్స్ అచ్చం ఆర్జివి సినిమా చూస్తున్నట్టుగా దించేశాడు సిద్ధార్థ్. హీరో హీరోయిన్ ఘాటు రొమాన్స్ కూడా డిటో కాపీ కొట్టాడని చెప్పొచ్చు. శిష్యుడిగా సిద్ధార్థ్ ఏం ప్రూవ్ చేద్దామని అనుకున్నాడో కాని భైరవగీత విషయంలో అతను అన్ని విధాలుగా ఫ్లాప్ అయ్యాడు. 

మొదటి భాగం, రెండో భాగం అనే తేడా లేదు వర్మ వాయిస్ ఓవర్ తోనే కథ అర్ధమవగా ఆడియెన్ డైరక్టర్ ఈ కథను ఎలా తీసుకెళ్తాడు అన్న ఎక్సైట్మెంట్ ను సినిమా మీద చూపించలేకపోయాడు. ఫైనల్ గా యూత్, ఫ్యామిలీ, మల్టీప్లెక్స్ ఇలాంటి వారెవరు భైరవ గీతకు వెళ్లే ఛాన్స్ లేదు. బి, సి సెంటర్స్ ఆడియెన్స్ తో పాటుగా వర్మ ఫ్యాన్స్ కు ఏమైనా నచ్చొచ్చు.

నటన, సాంకేతిక వర్గం :

ధనుంజయ్ పాత్ర చాలా వెయిలెంట్ గా ఉంటుంది. కుర్రాడు కొత్తవాడే అయినా బాగా చేశాడు. అయితే ఒకేరకమైన ఎక్స్ ప్రెషన్ తో కాస్త బోర్ కొట్టించాడు. ఇర్రా మోర్ అందానికి ఆడియెస్ ఫిదా అవుతారు. ఇక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సుబ్బా రెడ్డి, కట్టా రెడ్డి గా చేసిన బాల్ రాజ్ వాడి, విజయ్ రాం లు బాగానే చేశారు. మిగతా పాత్రలన్ని సోసోగా ఉన్నాయి.

ఇక భైరవ గీత టెక్నికల్ టీం విషయానికొస్తే.. సినిమా సినిమాటోగ్రఫీ బాగుంది. వర్మ మార్క్ టేకింగ్ తో అలరించాడు. కెమెరా మెన్ గా జగదీష్ తన బెస్ట్ ఇచ్చినట్టే. రవి శంకర్ మ్యూజిక్ జస్ట్ ఓకే. కథ, కథనాలు దర్శకుడు పాత చింతకాయ పచ్చడిలానే తెరకెక్కించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

భైరవగీత.. వర్మ మార్క్ తో వచ్చిన రొటీన్ సినిమా..!


Related Post