రజినికాంత్ 2.ఓ రివ్యూ & రేటింగ్

November 29, 2018
img

రేటింగ్ : 3/5 

కథ :

మనుషుల చేతుల్లోనుండి హఠాత్తుగా సెల్ ఫోన్స్ అన్ని మాయం అవుతుంటాయి. అత్యవసర సమావేశంలో దీనికి కారణం తెలుసుకోవాలని సైంటిస్ట్ వశీకర్ (రజినికాంత్)తో పాటుగా హోం మినిస్టర్ టీం చర్చలు చేస్తారు. అయితే తన ఫోన్ ద్వారా ఓ భయంకరమైన పక్షి ఇదంతా చేస్తుందని తెలుసుకుంటాడు వశీకర్. దాన్ని అంతమొందించాలి అంటే చిట్ట్ ది రోబోట్ అవసరం కావాలని అంటాడు. ముందు మినిస్టర్ ఒప్పుకోకున్నా ఆ పక్షి రాజు వరుస హత్యలు చేస్తుంటే చిట్టిని మళ్లీ తెస్తాడు వశీకర్. అలా మనుషుల మీద పగపట్టిన పక్షి రాజు (అక్షయ్ కుమార్)ను చిట్టి ఎలా సంహరించాడు అన్నది 2.ఓ కథ.

విశ్లేషణ :

రోబో సీక్వల్ సినిమా అనగానే కచ్చితంగా అంచనాలు ఉంటాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో 2.ఓ కొంతమేర ప్రయత్నించినా కథ పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షి జాతి అంతమవుతుందని ఆ తపనతో చనిపోయిన ఓ వ్యక్తి మనుషుల మీద పగ పెంచుకోవడం ఆ సమస్యను చిట్టి ఎలా అదిగమించాడు అన్నది చూపించారు.  

రోబో సినిమ కథ, విజువల్ ఎఫెక్ట్స్ రెండు అదిరిపోయాయి. కాని 2.ఓలో కథ కథనాలు పెద్దగా ఆకట్టుకోలేదు. విజువల్ గా అదరిరిపోయేలా ఉన్నా ఎక్కడో స్క్రీన్ ప్లే తేడా కొట్టిందనిపిస్తుంది. గ్రాఫిక్స్ వరకు సినిమాకు పెట్టిన బడ్జెట్ అంత తెర మీద కనిపిస్తుంది. కథ విషయంలో శంకర్ ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. రజిని ఫ్యాన్స్ కు నచ్చేలా 2.ఓ ఉందని చెప్పొచ్చు. విజువల్ వండర్ గా వచ్చిన ఈ 2.ఓ ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుండెది అనిపిస్తుంది.

నటన, సాంకేతికవర్గం : 

సూపర్ స్టార్ రజిని యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. వశీకర్, చిట్టి రోబో రెండు పాత్రల్లో రజిని తన స్టైల్, యాక్షన్ తో అదరగొట్టాడు. అక్షయ్ కుమార్ కూడా పక్షి రాజు పాత్రకు ప్రాణం పోశాడు. సినిమాకు రజిని, శంకర్ లతో పాటుగా అక్షయ్ కుమార్ కూడా బాగా కష్టపడ్డాడని తెలుస్తుంది. ఎమీ జాక్సన్ ఉన్నది అంటే ఉంది అన్నట్టుగా ఆమెని ఓ రోబోగా చూపించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే నిరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్ అయితే అదిరిపోయాయి. ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ లో విజువల్స్ బాగున్నాయి. శంకర్ కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. స్క్రీన్ ప్లే ఓకే అనేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారు.

ఒక్కమాటలో :

2.ఓ ఓన్లీ ఫర్ విజువల్ ఎఫెక్ట్స్..!  


Related Post