అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ & రేటింగ్

November 16, 2018
img

రేటింగ్ : 2/5

కథ :

చిన్నప్పుడే తన తండ్రి పార్ట్ నర్స్ వల్ల కుటుంబాన్ని దూరం చేసుకున్న అమర్ (రవితేజ) వారి మీద పగ సాధించాలని చూస్తుంటాడు. బాంబ్ బ్లాస్ట్ చూడటం వల్ల తను ఓ డిజార్డర్ కు గురవుతాడు. అందుకే కొన్నిసార్లు అక్బర్, ఆంటోనిగా ప్రవర్తిస్తుంటాడు. అమర్ స్నేహితురాలు ఐశ్వర్య (ఇలియానా) అమర్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతకీ అమర్ తన కుటుంబాన్ని చంపిన వారిని ఎలా కనిపెట్టాడు..? అతనికి ఉన్న డిజార్డర్ వల్ల అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి..? అమర్, ఐశ్వర్యలు ఎలా కలిశారు అన్నది సినిమా కథ.    

విశ్లేషణ :

శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో నీకోసం, వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ఉండే అంచనాలను ఈ సినిమా అందుకోలేదని చెప్పాలి. శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే కామెడీ నవ్విస్తుంది కాని ఈ సినిమాలో అంతమంది ఆర్టిస్టులు ఉన్నా లాభం లేకుండా పోయింది.  

సినిమా కథ రొటీన్ గా అనిపిస్తుంది. అయితే దానికి రాసుకున్న కథనం కాస్త ఇంట్రెస్ట్ గా సాగించే అవకాశం ఉన్నా శ్రీను వైట్ల తప్పటడుగులు వేశాడు. మొదటి భాగం టైం పాస్ చేసిన శ్రీను వైట్ల సెకండ్ హాఫ్ కూడా అంతే బోర్ కొట్టించాడు. సినిమా 1 నేనొక్కడినే, అతనొక్కడే సినిమాలకు దగ్గరగా ఉంటుంది.

కథ రొటీన్ గా అనిపించడమే కాదు కథనం కన్ ఫ్యూజ్ చేసి ప్రేక్షకుల పేషెన్స్ కు టెస్ట్ పెట్టినట్టు చేశారు. ఓవరాల్ గా అమర్ అక్బర్ ఆంటోని రొటీన్ కథ, విసుగుపుట్టించే కథనంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.

నటన, సాంకేతికవర్గం : 

రవితేజ చేయడానికి మూడు పాత్రలు చేసినా ఏ ఒక్క పాత్రలో తన మార్క్ చూపించలేకపోయాడు. అతని నుండి అభిమానులు ఆశించే కామెడీ, ఎనర్టిక్ డైలాగ్స్ ఈ సినిమాలో లేవు. అఫ్కోర్స్ శ్రీను వైట్ల క్యారక్టరైజేషన్ అలా రాశాడని చెప్పొచ్చు. ఇలియానా ఓకే అనేలా ఉంది. తన వాయిస్ కు తానే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక విలన్స్ గా నటించిన వారిలో అందరు సోసోగానే చేశారు. షయాజి శిండే ఎప్పటిలానే తన నటనతో మెప్పించాడు. అభిమన్యు సింగ్ ఎప్పటిలానే విలనిజం చూపించాడు. కమెడియన్స్ సునీల్, వెన్నెల కిశోర్, సత్య, శ్రీనివాస్ రెడ్డి, జయ ప్రకాశ్ రెడ్డి, రఘు బాబు లాంటి వారు ఉన్నా కామెడీ అంతగా పండలేదు.  

వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సినిమా మొత్తం యూఎస్ లోనే కాబట్టి అక్కడ అందమైన లొకేషన్స్ అన్ని కవర్ చేశారు. తమన్ మ్యూజిక్ మెప్పించలేదు. బిజిఎం ఓకే. కథ, కథనాల్లో దర్శకుడు శ్రీను వైట్ల రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. మైత్రి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఖర్చుకి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది. 

ఒక్కమాటలో : 

అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీను వైట్ల ఫెయిల్యూర్ కంటిన్యూస్..!



Related Post