సవ్యసాచి రివ్యూ & రేటింగ్

November 02, 2018
img

రేటింగ్ : 2.5/5

కథ :

విక్రం (నాగ చైతన్య) ఒకడుగా కనిపించినా అతనిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇద్దరుగా పుట్టాల్సిన అతను ఒక్కడుగా పుడతాడు అందుకే ఎడమ చేయి వేరేగా ప్రవర్తిస్తుంది. ఇక ఇవి విక్రం ను అప్పుడప్పుడు ఇబ్బందుల్లో పడేస్తుంది. మరో పక్క కాలేజ్ లో లవ్ చేసిన చిత్ర (నిధి అగర్వాల్) సరిగా ఆమె ప్రపోజ్ చేసే టైం కు విక్రం దూరమవుతాడు. అక్కతో సరదాగా జీవితం సాగిపోతుంది అనుకుంటున్న టైంలో విలన్ అతని ఫ్యామిలీ మీద పగ పడతాడు. విక్రం బావని చంపి.. అక్కని హాస్పిటల్ పాలు చేస్తాడు. అతని మేనకోడలిని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ ఇదంతా చేస్తుంది ఎవరు..? ఎందుకు విక్రం ఫ్యామిలీని టార్గెట్ చేశాడు..? అతనికి విక్రం ఎలా బుద్ధి చెప్పాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

కార్తికేయ లాంటి సినిమాతో ప్రతిభ చాటిన చందు మొండేటి నాగ చైతన్యతో ప్రయోగాత్మకంగా చేసిన సినిమా సవ్యసాచి. హీరో పాత్రని కొత్తగా రాసుకున్న దర్శకుడు సినిమా కథ మొత్తం దాన్ని వాడుకోలేదు. ఏదో హీరో పాత్రని కొత్తగా రాసుకుని మిగతా కథ అంతా రొటీన్ గా రాసుకున్నాడు.

ఈ కథకు అతను అనుకున్న వానిషింగ్ ట్విన్ సిండ్రోం కాన్సెప్ట్ యాప్ట్ అవలేదు. కావాల్సినప్పుడుగా హీరో ఎడమ చేయి గురించి చూపించడం ఆ తర్వాత మళ్లీ రొటీన్ గా నడిపించడం సాగింది. కథ, కథనాలు దర్శకుడు చందు రొటీన్ గా నడిపించడం జరిగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఆకట్టుకున్నాడు.

ఇలాంటి సినిమాలు కథగా రాసుకున్నప్పుడు బాగుంటాయి. కాని సినిమా తెర మీద ఆ ఫీల్ కలగాలంటే స్క్రీన్ ప్లే బాగా రాసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో చందు సవ్యసాచిని సరిగా డీల్ చేయలేదని చెప్పాలి.

నటన, సాంకేతిక వర్గం :

నాగ చైతన్య నటన బాగుంది. ఎడమ చేయి తన ఆదీనంలో లేకుండా ఉండే పాత్రలో మెప్పించాడు. ఫైట్స్, డ్యాన్స్ లలో కాస్త డెవలప్ అయ్యాడనిపిస్తుంది. హీరోయిన్ నిధి అగర్వాల్ పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాదు. అయినా సరే ఆమె అలరించింది. విలన్ గా మాధవన్ నటన మెప్పించింది. తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్ కామెడీ సోసోగా ఉంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. యువరాజ్ సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. సినిమాకు కీరవాణి మ్యూజిక్ అలరించింది. బిజిఎం ఆకట్టుకుంది. కథ, కథనాల్లో దర్శకుడు చందు మొండేటి ఇంకాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

సవ్యసాచి.. ప్రేక్షకులను మెప్పించలేదు..!


Related Post