అరవింద సమేత రివ్యూ & రేటింగ్

October 11, 2018
img

రేటింగ్ : 3/5

కథ :

ఫ్యాక్షన్ గొడవల్లో తండ్రి నారప రెడ్డి (నాగ బాబు) చనిపోవడంతో అక్కడ నుండి సిటీకి షిఫ్ట్ అవుతాడు వీర రాఘవ (ఎన్.టి.ఆర్). సిటీలో ఉంటున్న వీర రాఘవకు అరవింద (పూజా హెగ్దె) పరిచయం అవుతుంది. ఆమె మీద ఎటాక్ జరుగగానే ఆమెకి బాడీ గార్డ్ గా ఉంటాడు వీర రాఘవ. ఆమెతో పాటే అరవింద సొంతూరికి వెళాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఇంతకీ అరవింద ఎవరు..? తండ్రిని చంపిన బసి రెడ్డి మీద వీర రాఘవ ఎలా పగ తీర్చుకున్నాడు..? నాయనమ్మకు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టాడు అనంది సినిమా కథ. 

విశ్లేషణ :

స్టార్ హీరో.. స్టార్ డైరక్టర్ అనగానే ఆ సినిమాకు ఎక్కడ లేని అంచనాలు ఏర్పడతాయి. అరవింద సమేత సినిమాకు అంతే.. ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం సినిమా ఎలా ఉంటుందో అని తారాస్థాయిలో అంచనాలు పెంచుకున్నారు. ఫ్యాక్షన్ కథనే తనదైన స్టైల్ లో కొత్తగా తీశాడు త్రివిక్రం. కథ కోసం లేని పోని కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా సినిమా చాలా క్లీన్ గా తీశాడు గురూజీ.

అయితే ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్ అన్న ఒక్క యాస్పెక్ట్ తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్ అనిపించుకుంది. సినిమా మొదటి 20 మినిట్స్ అదుర్స్ అనిపించగా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. రన్ టైం కూడా ఎక్కువయినట్టు అనిపిస్తుంది. నందమూరి అభిమానులకు ఈ సినిమా ఓ కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పొచ్చు.

ఫ్యాక్షన్ కథలను త్రివిక్రం డీల్ చేస్తాడని చూపించిన సినిమా అరవింద సమేత. అయితే సినిమాలో తన మార్క్ కామెడీ జోడించి ఉంటే లెక్క వేరేలా ఉండేది.

నటన, సాంకేతికవర్గం :

వీర రాఘవ పాత్రలో ఎన్.టి.ఆర్ అదరగొట్టాడు. ఆ క్యారక్టర్ కు తారక్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఇక సినిమాలో పూజా హెగ్దె బాగానే చేసింది. సినిమా మొత్తం ఆమె ఉంటుంది. మరో హీరోయిన్ ఈషా రెబ్బ ఓకే అనిపించగా సునీల్ ఈ సినిమాలో చేసిన నీలాంబరి పాత్ర మెప్పించింది. జగపతి బాబు విలనిజం అదిరిపోయింది. నాగ బాబు మిగతా పాత్రలంతా బాగా చేశారు.

ఇక టెక్నికల్ డిపార్టెంట్ విషయానికొస్తే.. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ చాలా అందంగా కనిపించాడు. తమన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్, పెనివిటి సాంగ్ బాగా వచ్చాయి. బిజిఎం ఓకే. కథ, కథనాల్లో దర్శకుడు త్రివిక్రం తన మార్క్ చూపించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా రిచ్ గా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చేశారు.

ఒక్కమాటలో :

అంచనాలను అందుకున్న అరవింద సమేత..!


Related Post