నోటా రివ్యూ & రేటింగ్

October 05, 2018
img

రేటింగ్ : 2/5 

కథ:

లండన్ నుండి వచ్చిన వరుణ్ (విజయ్ దేవరకొండ) అనుకోకుండా తండ్రి వాసుదేవ్ (నాజర్) చెప్పాడని సిఎంగా మారుతాడు. అయితే ముందు సిఎంగా చాలా లైట్ తీసుకున్న విజయ్ వాసుదేవ్ అనుచరులు చేసిన అల్లర్లలో ఒక పాప మరణించడం వల్ల విజయ్ లో మార్పు వస్తుంది అప్పటి నుండి సిఎంగా తన బాధ్యతలను మొదలు పెడతాడు. ఇక ఇదే క్రమంలో తన తండ్రి యాక్సిడెంట్.. అతను కోమాలోకి వెళ్లడం ఇలా అన్ని అతన్ని కష్టాల్లో పడేస్తాయి. అప్పుడు వరుణ్ ఏం చేశాడు..? ఈ సమస్యల నుండి ఎలా బయట పడ్డాడు..? సిఎంగా తన బాధ్యత ఎలా నిర్వర్తించాడు అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :

లీడర్, భరత్ అనే నేను సినిమాల్లో కూడా హీరో సడెన్ గా ఎక్కడ నుండో వచ్చి సిఎం అవుతాడు. అయితే ఆ సినిమాలకు ఈ సినిమాలకు పోలిక ఉండదు. విజయ్ సిఎంగా బాగానే చేశాడు కాని కథ, కథనాలే ఆశించినంతగా లేవు. ముఖ్యంగా కథనం ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడకు వెళ్తుందో ఎవరికి అర్ధం కాదు.

సినిమా మొత్తం తమిళ నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. సిఎం కు వంగి దండాలు పెట్టే ఆనవాయితీ అక్కడిదే. ఇక సినిమా మొదటి భాగం కాస్త పర్వాలేదు అన్నట్టు ఉన్నా సెకండ్ హాఫ్ మరి ల్యాగ్ చేశారు. తల తోక లేని కథనంతో సినిమా సాగదీశారు.       

తెలుగు ఆడియెన్స్ కు ఏమాత్రం రుచించనిదిగా నోటా ఉందని చెప్పొచ్చు. మంచి ఫాంలో ఉన్న విజయ్ అసలు ఇలాంటి సబ్జెక్ట్ ఎలా ఎంచుకున్నాడా అన్న డౌట్ వస్తుంది. నోటా టైటిల్ కు ఈ సినిమాకు అసలు ఏమాత్రం సంబంధం ఉండదు.

నటన, సాంకేతికవర్గం :

విజయ్ తన వరకు బాగానే చేశాడు. కాని దర్శకుడు ఇంకా అతన్ని బాగా వాడుకోవాల్సిందని సినిమా చూశాక అనిపిస్తుంది. మెహ్రీన్ కౌర్ ఎందుకు ఉన్నదో అర్ధం కాదు. సత్యరాజ్, నాజర్ పాత్రలు బాగానే ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్ నాజర్ కు వాడిన మేకప్ సరిగా కుదరలేదు. ప్రియదర్శి కూడా రెండు మూడు సీన్స్ కే పరిమితమయ్యాడు.  

సామ్ సిఎస్ మ్యూజిక్ పాటలు మెప్పించలేదు కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. సంతానం కృష్ణన్ సినిమాటోగ్రఫీ ఓకే. ఆనద్ రంగ కథ, కథనాలు తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. దర్శకుడు ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ఒక్కమాటలో :

విజయ్ నోటాకి ఓటు వేయడం కష్టమే..!


Related Post