దేవదాస్ రివ్యూ & రేటింగ్

September 27, 2018
img

రేటింగ్ : 2.75/5

కథ :

డాక్టర్ అయిన దాసు (నాని) ఓ కార్పోరేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తూ అక్కడ చేసిన ఓ పని వల్ల బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఓ పాడుపడిన క్లినిక్ నడిపుతున్న అతని దగ్గరకు దేవా (నాగార్జున) రక్తపు మడుగులతో వస్తాడు. బుల్లెట్ దిగిన అతన్ని చూసి ముందు అతనికి చిన్న సర్జరీ చేసి అతనికి నయం చేస్తాడు. అయితే ఈ టైంలో దాసు మనసు నచ్చి దేవా అతనితో స్నేహంగా ఉంటాడు. ఇద్దరు ఇద్దరికి దగ్గరవుతారు. అయితే తమ ప్రేమ గురించి ఇద్దరు వ్యక్తపరచుకుని ఇదే టైంలో దేవా కోసం ఓ పక్క పోలీసులు.. మరో పక్క అతని శత్రువులైన డేవిడ్ మనుషులు వెతుకుతూ ఉంటారు. ఫైన గా దేవాని వారు ఏం చేశారు..? దేవా.. దాసుల మధ్య పూజా, జాహ్నవిలు ఎలా వచ్చారు..? వీరి కథ ఎలా ముగిసింది అన్నది సినిమా.

విశ్లేషణ :

యువ దర్శకుడైన శ్రీరాం ఆదిత్య ముందు చేసిన రెండు సినిమాలు కూడా ఎంటర్టైనింగ్ గా సాగాయి. భలే మంచి రోజు, శమంతకమణి రెండు సినిమాలు అలరించాయి. ఇక అదే ఎంటర్టైనింగ్ యాంగిల్ లో వచ్చిన సినిమా దేవదాస్. నాగార్జున, నానిల మల్టీస్టారర్ గా వచ్చిన ఈ సినిమా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.

సినిమాలో ఇద్దరు బాగా చేశారు. దర్శకుడు సినిమా మొత్తం కామెడీగా మలిచే క్రమంలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ మిస్ చేశాడని అనిపిస్తుంది. దేవా గతానికి సంబందించిన సీన్స్ క్లియర్ గా చూపించరు. మరోపక్క నాని, నాగ్ ల మధ్య స్నేహం కూడా బాగున్నప్పటికి ఆడియెన్స్ కు అంత టచ్ అవలేదు. స్క్రీన్ మీద ఇద్దరు హీరోలు మాత్రం ప్రేక్షకులను అలరిస్తారు.

కథ అంత కిక్ ఇవ్వలేదు. కథనం నడిపించిన తీరు బాగున్నా స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్త పడితే బాగా వచ్చేదని చెప్పొచ్చు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నాగార్జున, నాని అభిమానులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంది. 

నటన, సాంకేతిక వర్గం :

నాగార్జున, నానిల నటన హైలెట్ గా నిలిచిన సినిమా దేవదాస్. ఇద్దరి పాత్రలు రాసుకున్న తీరు బాగుంది. డాన్ గా నాగార్జున ఎవర్ గ్రీన్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. నాని ఎప్పటిలానే తన నాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా నటించిన రష్మిక, ఆకాంక్ష సింగ్ కూడా ఆకట్టుకున్నారు. రష్మిక నానికి పెయిర్ గా నటించగా.. ఆకాంక్ష సింగ్ నాగార్జునకు జోడీ కట్టేసింది. ఇక మురళి శర్మ పోలీస్ రోల్ లో ఎప్పటిలానే సహజంగా నటించాడు. నరేష్, వెన్నెల కిశోర్, జబర్దస్త్ వేణు కొన్ని సీన్స్ కే పరిమితమయారు. సత్య కూడా కనిపించినప్పుడల్లా నవ్వించాడు.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. శందత్ సాయుద్దీన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ఇద్దరి హీరోలను బాగా చూపించాడు. మణిశర్మ మ్యూజిక్ బాగుంది. బిజిఎం బాగా ఇచ్చాడు. ఇక కథ, కథనాల్లో దర్శకుడు శ్రీరాం ఆదిత్య మెప్పించాడు. కథ అంత గొప్పగా లేకున్నా కథనం ఎంటర్టైనింగ్ గా సాగించాడు. వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో : 

నాగార్జున, నానిల దేవదాస్.. కామెడీ ఎంటర్టైనర్..!


Related Post