నన్ను దోచుకుందువటే రివ్యూ & రేటింగ్

September 21, 2018
img

రేటింగ్ : 2.5/5

కథ : 

యూఎస్ వెళ్లాలనే గోల్ తో పనిచేస్తున్న కార్తిక్ (సుధీర్ బాబు) మరదలితో పెళ్లి తప్పించే ప్రయత్నంలో తండ్రికి తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా అని అబద్ధం చెబుతాడు. అయితే సడెన్ గా తన తండ్రి ఊరు నుండి వస్తున్నాడని తెలుసుకుని షార్ట్ ఫిలింస్ లో నటించే అమ్మాయి మేఘన (నభా నటేష్) ను తండ్రి దగ్గర లవర్ గా పరిచయం చేస్తాడు. అయితే కార్తిక్ నాన్నకు సిరి అలియాస్ మేఘన బాగా నచ్చుతుంది. వారి పెళ్లికి ఆయన అంగీకరిస్తాడు. అయితే మేఘనకు దగ్గరయ్యే క్రమంలో తను అనుకున్న గోల్ రీచ్ అయ్యే అర్హత చివరి నిమిషంలో కోల్పోతాడు కార్తిక్. ఇదంతా మేఘన వల్లే అని ఆమెను దూరం చేసుకుంటాడు. కెరియర్ మీద ఇష్టంతో తనని ఇష్టపడుతున్న మేఘనని దూరం చేసుకున్న కార్తిక్ ఫైనల్ గా ఏం చేశాడు అన్నదే సినిమా కథ.

విశ్లేషణ :

నన్ను దోచుకుందువటే.. సుధీర్ బాబు మొదటిసారి నిర్మాతగా చేసిన ప్రయత్నం.. మొదటి భాగం అంతా సరదగా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టించేస్తుంది. దర్శకుడు ఆర్.ఎస్ నాయుడు సెకండ్ హాఫ్ రొటీన్ గా సాగదీసినట్టు అనిపిస్తుంది. కథ కూడా కొత్తగా అనిపించదు. 

ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో సుధీర్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. మొదటి సినిమానే అయినా సినిమా బడ్జెట్ బాగా సెట్ చేశాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కథ, కథనాల్లో దమ్ము చూపించలేదని చెప్పొచ్చు. దర్శకుడు కథనంలో ఇంకాస్త గ్రిప్పింగ్ ఉండేలా చూసుకుంటే బాగుండేది.

నటన, సాంకేతికవర్గం :

సమ్మోహనంతో సూపర్ హిట్ అందుకున్న సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాలో నటనలో పరిణితి కనిపించింది. సుధీర్ బాబు ఈ సినిమా అంతా తన భుజాన వేసుకున్నాడని చెప్పొచ్చు. హీరోయిన్ నభా నటేష్ కూడా పర్వాలేదు. అయితే కొన్ని చోట్ల ఆమె బాగుందనిపించగా కొన్ని చోట్ల మెప్పించలేదు. సుదర్శన్, తులసి, నాజర్ లాంటి వారు మెప్పించారు.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది.. సుధీర్ బాబుని చాలా ఇంప్రెసివ్ గా చూపించాడు. అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ఓకే.. సినిమాలో పాటలు సోసోగా ఉన్నా బిజిఎం అలరించింది. కథ, కథనాల్లో దర్శకుడు ఆర్.ఎస్ నాయుడు కొత్తగా ఏం చూపించలేదు. తెలిసిన కథనే తెలిసినట్టుగా కథనంతోనే సినిమా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొదటి సినిమానే అయినా సుధీర్ బాబు నిర్మాతగా మెప్పించాడు.

ఒక్కమాటలో :

సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే.. కామెడీ ఓకే.. కాని..!


Related Post