యూ టర్న్ రివ్యూ & రేటింగ్

September 13, 2018
img

రేటింగ్ : 2.75/5

కథ :

టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న రచన (సమంత) ఓ డివైడర్ మీద ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వారి మీద ఓ స్టోరీ ప్రిపేర్ చేయాలని అనుకుంటుంది. ఇలాంటి టైంలో వారి నెంబర్లను సేకరించి వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంతలోనే ఆమె ఇంటర్వ్యూ చేసి వచ్చిన ఒకతను చనిపోతాడు. పోలీసులు రచన ఆ మర్డర్ చేసిందని అనుకుంటారు. అంతేకాదు రచన ఎవరైతే వివరాలు సేకరిస్తుందో వారంతా వరుసగా చనిపోతుంటారు. పోలీసులు రచనని విచారిస్తుండగా ఆమె సేకరించిన సమాచారం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ రచనకు ఆ వరుస మర్డర్స్ కు సంబంధం ఏంటి..? అవి ఎలా జరుగుతాయి..? వాటిని ఎలా ఛేధించారు అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమాను తెలుగులో సమంత ఇష్టపడి మరి రీమేక్ చేసింది. సినిమా దర్శకుడు పవన్ కుమార్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తో మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. సినిమా మొత్తం ఆసక్తికరంగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. అతను చేసిన మొదటి సినిమా లూసియాతోనే అతని ప్రతిభ అందరికి తెలిసింది.

ఇక తెలుగులో మొదటి ప్రయత్నంగా యూటర్న్ ఆకట్టుకుంది. అయితే ఫస్ట్ హాఫ్ కథ చాలా వేగంగా సస్పెన్స్ గా నడిపించగా.. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ లాజిక్ లేకుండా ఉంటుంది. సూపర్ నాచురల్ పవర్ కొన్ని అక్కడక్కడ కాస్త ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడనిపిస్తుంది. 

కథ, కథనంలో అనవసర హంగులు లేకుండా గ్రిప్పింగ్ గా నడిపించాడు. సినిమా అంతా సమంత భుజాల మీద వేసుకుని చేసిందని చెప్పొచ్చు. రొటీన్ కమర్షియల్ సినిమాలు నచ్చే వారికి ఇది ఎక్కకపోవచ్చు. అంచనాలను మాత్రం అందుకోవడంలో సక్సెస్ అయ్యింది.

నటన, సాంకేతికవర్గం :

రచన పాత్రలో సమంత బాగా చేసింది. కన్నడలో సినిమా చూసిన సమంత ఆ సినిమా తెలుగులో రీమేక్ తన ఇంట్రెస్త్ మేరకే చేయడం జరిగింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా పెళ్లి తర్వాత సమంత ఈ కొత్త టర్న్ అలరిస్తుంది. ఇక సినిమాలో సర్ ప్రైజ్ రోల్ లో భూమిక నటించి మెప్పించింది. ఆది పినిశెట్టి, రాహుల్ రవింద్రన్ కూడా అలరించారు.

టెక్నికల్ టీం విషయానికొస్తే.. పూర్ణచంద్ర తేజశ్వి మ్యూజిక్ ఆకట్టుకుంది. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు పవన్ మెసేజ్ ఇస్తూ మంచి సస్పెన్స్ గా తీసుకెళ్లాడు. ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ లో కూడా రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

సమంత యూటర్న్.. ప్రయోగం సక్సెస్..!

Related Post