శైలజా రెడ్డి అల్లుడు రివ్యూ & రేటింగ్

September 13, 2018
img

రేటింగ్ : 2.25/5

కథ :

బిజినెస్ మ్యాన్ కోటీశ్వరుడు అయిన రావు (మురళి శర్మ) ఈగోయిస్ట్ గా ఉంటాడు. తనకు నచ్చనిది ఏది కాంప్రమైజ్ అవని వ్యక్తిత్వం అతనిది. ఇదే అతనికి ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. అతని కొడుకు చైతన్య (నాగ చైతన్య) మొదటి చూపులోనే అను (అను ఎమ్మాన్యుయెల్)ను ప్రేమిస్తాడు. శైలజా రెడ్డి కూతురు అయిన అను చైతన్య తండ్రిని మించి ఈగోతో ఉంటుంది. ఎలాగోలా చైతన్య తన తండ్రిని ఒప్పించి వారి ప్రేమని గెలిపించుకోగా మరో పక్క శైలజా రెడ్డి లేకుండానే చైతు, అనుల ఎంగేజ్మెంట్ కానిచ్చేస్తారు. ఈ టైంలో విషయం తెలుసుకున్న శైలజా రెడ్డి ఏం చేసింది. చైతు, అనుల ప్రేమ పెళ్లి జరిగిందా లేదా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ఈరోజుల్లో సినిమా నుండి తన ప్రతి సినిమాలో మారుతి కామెడీ బాగా ఉండేలా చూసుకుంటాడు. నాగ చైతన్యతో శైలజా రెడ్డి అల్లుడులో కామెడీ ఉన్నా అది కొద్దిపాటి నవ్వులకే పర్మితమైందని చెప్పొచ్చు. సినిమా కథ, కథనాలు పాత చింతకాయ పచ్చడిలానే అనిపిస్తాయి. తెలిసిన కథనే తిప్పి తిప్పి చెప్పాడనిపిస్తుంది.

అయితే మరుతి తన ప్రతి సినిమాలో పండించే కామెడీ కూడా ఇందులో లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. సినిమా మొదటి భాగం చాలా సరదాగా సాగుతుంది.. మెప్పిస్తుంది. కాని సెకండ్ హాఫ్ మాత్రం ఢీలా పడేలా చేస్తుంది. అసలేమాత్రం కొత్తగా అనిపించని సెకండ్ హాఫ్ బోర్ కొట్టించేస్తుంది.

రమ్యకృష్ణ క్యారక్టరైజేషన్ బాగానే రాసుకున్నా ఆమెకు ఇచ్చిన బిల్డప్ కు ముగించిన తీరు మ్యాచ్ అవలేదు. అలానే మురళి శర్మ పాత్ర కూడా అంతే. ఫస్ట్ హాఫ్ వరకు మెప్పించిన శైలజా రెడ్డి అల్లుడు సెకండ్ మరీ రొటీన్ గా అనిపిస్తాడు. 

నటన, సాంకేతికవర్గం :

చైతన్య పాత్రలో నాగ చైతన్య ఇంప్రెస్ చేశాడు. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య లుక్స్ బాగున్నాయి. ఇక అను ఎమ్మాన్యుయెల్ రోల్ పర్వాలేదు. రమ్యకృష్ణ పాత్ర ఆకట్టుకుంది. థర్టీ ఇయర్స్ పృధ్వి కామెడీ బాగుంది. అయితే అది ఇంకాస్త ఉంటే బాగుండేది. నరేష్, వెన్నెల కిశోర్ నటన అలరించింది.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. నిజార్ షఫి సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. కెమెరా వర్క్ సినిమాకు హెల్ప్ అయ్యింది. ఇక గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. బిజిఎం కూడా అదరగొట్టాడు. కథ, కథనాలు రొటీన్ గా అనిపించడంతో మారుతి పెద్దగా ప్రతిభ చూపలేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి.


ఒక్కమాటలో :

శైలజా రెడ్డి అల్లుడు..  కొంచం ఇష్టం.. కొంచం కష్టం..! Related Post