సాక్ష్యం రివ్యూ & రేటింగ్

July 27, 2018
img

రేటింగ్ : 2.5/5

కథ :  

చారిత్రాత్మక స్వస్తిక్ నగరంలో ఉండే రాజు గారు (శరత్ కుమార్) అక్కడ అన్నదమ్ములైన మును స్వామి (జగపతి బాబు) అశుతోష్ రానా, రవి కిషన్ ల అన్యాయాలకు అడ్డుగా ఉంటాడు. అతన్ని అడ్డు తొలగిస్తే గాని తమ పనులు సక్రమంగా జరుగవని గుర్తించిన ఆ ముగ్గురు అన్నదమ్ములు అతి కిరాతకంగా రాజు గారి కుటుంబాన్ని చంపేస్తారు. రాజు గారి కొడుకుని మాత్రం అతని తల్లి కాపాడుతుంది. ఇదిలా ఉంటే తల్లిదండ్రులు చనిపోయిన అతను కాశిలో దొరికే సరికి విశ్వజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్)గా పేరు పెట్టి పెంచుకుంటారు. ఫారిన్ లో ఉండే విశ్వ సౌందర్య లహరి (పూజా హెగ్దె)ని చూసి ఇష్టపడతాడు. ఆమె కోసం ఇండియాకు వస్తాడు విశ్వ. అక్కడ తన నేచర్ సహాయంతో తన తల్లిదండ్రులను చంపిన వారిని గుర్తించి చంపేస్తాడు. విశ్వకు ప్రకృతి ఎలా సహకరించింది..? వారిని ఎలా కనిపెట్టాడు..? ఎలా శిక్షించాడు అన్నదే సినిమా కథ.   

విశ్లేషణ :

ఇది ఓ ఫాంటసీ కథగా చెప్పేందుకు దర్శకుడు చెప్పిన కథనం బాగుంది. అయితే కథ, కథనాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉన్నా ఎక్కడో లాజిక్ లేకుండా కొన్ని సీన్స్ కనిపించడం డిస్ట్రబ్ చేస్తాయి. ఇక సినిమాలో హీరో యాక్షన్, డ్యాన్స్ బాగా దృష్టి పెట్టారు. మొదటి భాగం సరదాగా సాగగా సెకండ్ హాఫ్ కాస్త ఎక్కువ ఎమోషనల్ గా అనిపిస్తుంది.

సినిమా కమర్షియల్ వాల్యూస్ కు కొదవ లేదు. పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కబడుతుంది. అయితే హీరో స్టామినాని బట్టి బడ్జెట్ పరిమితులు ఉంటే బాగుండేది. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ కు ఈ సినిమాలో ఛాన్స్ ఉంది.

నటన, సాంకేతిక వర్గం :

బెల్లంకొండ శ్రీనివాస్ నటన పరంగా పర్వాలేదు. అయితే ఫైట్స్, డ్యాన్స్ మాత్రం అలరించాడు. పూజా హెగ్దె గ్లామర్ షో బాగుంది. ఆమెను ఉన్నంతలో బాగా వాడుకున్నారు. శరత్ కుమార్, మీనా పాత్రలు బాగున్నాయి. విలన్ గా జగపతి బాబు మరోసారి అదరగొట్టారు. అశురోష్ రానా, రవి కిషన్ కూడా మంచి నటన కనబరిచారు. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఓకే. పాటలు ప్లేస్ మెంట్ సరిగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. ఆర్దన్ విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ వర్క్ బాగానే చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. దర్శకుడు అడిగిన బడ్జెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఒక్కమాటలో :  

సాక్ష్యం కథ బాగుంది.. కథనం ట్రాక్ తప్పింది..! 

Related Post