RX100 రివ్యూ & రేటింగ్

July 12, 2018
img

రేటింగ్ : 2.25/5

కథ : 

తల్లిదండ్రులు లేని శివ (కార్తికేయ)ని డాడీ (రాంకీ) పెంచుకుంటాడు. ఊరి ప్రెసిడెంట్ విశ్వనాథం దగ్గర పనిచేసే డాడీ అతనికి ఎదురు తిరుగుతాడు. ఈలోగా శివ, విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్ పుత్)ను ప్రేమిస్తాడు. ఇద్దరు ప్రేమలో అ..ఆ నుండి అం.. అః వరకు వెళ్తారు. విషయం తెలిసిన విశ్వనాథం శివని రౌడీలతో బంధించి ఇందుని ఎన్నారైకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అసలు సినిమా.   

విశ్లేషణ :

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ప్రేమలో అడ్వాన్స్ గా వెళ్లడం.. ప్రేయసే ఊపిరి, ప్రాణం అనుకోవడం ఆమె దూరమయ్యాక ఓ సైకోలా మారడం చూశాం చూస్తున్నాం.. ఈ సినిమా కూడా అదే కోవలో వచ్చింది. పక్కా అర్జున్ రెడ్డి రిఫరెన్స్ వాడాడని చెప్పొచ్చు. ఇక ప్రేమికుల రొమాన్స్ లా కాకుండా అదో రకమైన రొమాన్స్ ఇందులో ఉంచారు.  

హీరో, హీరోయిన్ కనిపిస్తే ముద్దులాటే అన్న విధంగా ఉంటుంది. హీరోయిన్ అందుకు బాగా కోపరేట్ చేసింది. కచ్చితంగా హీరోయిన్ క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. అయితే ఎంచుకున్న కథ.. దానికి రాసుకున్న కథనం సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేరవేయడంలో విఫలమయ్యాడు దర్శకుడు. కథనం చాలా ల్యాగ్ అనిపిస్తుంది.

లాస్ట్ 20 నిమిషాలు మాత్రం సినిమా ట్రాక్ ఎక్కినట్టు అనిపిస్తుంది. ఆరెక్స్ 100 టైటిల్ కు సినిమాకు సంబంధం ఉండదు. కేవలం హీరో ఆ బైక్ వాడటం తప్ప ఎక్కడ లింక్ ఉండదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ లో ఎమోషన్ బాగా క్యారీ అయ్యింది.  

నటన, సాంకేతిక వర్గం :  

కార్తికేయ నటన ఆకట్టుకుంది. అయితే మొదటి సినిమా కాబట్టి అక్కడక్కడ ఇంకాస్త బెటర్ గా చేసుండొచ్చు అనిపిస్తుంది. హీరోయిన్ పాయల్ అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో ఆమె గ్లామర్ అదిరిపోయింది. రాంకీ చాలా రోజుల తర్వాత మంచి పాత్ర చేశాడు. రావు రమేష్ కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు.  

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కథ, కథనాలు దర్శకుడు అజయ్ భూపతి ప్రమోషన్స్ లో చెప్పిన వెరైటీ ఏం కనిపించదు. సినిమా అంతా రొటీన్ పంథాలో సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

ఒక్కమాటలో : 

ఆరెక్స్ 100.. రైడింగ్ లో ఫెయిల్ అయ్యింది..! 


Related Post