తేజ్ ఐలవ్యూ రివ్యూ & రేటింగ్

July 06, 2018
img

రేటింగ్ : 2/5

కథ :

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్ పెదనాన్న విశ్వనాథ్ (జయప్రకాశ్) తో ఉంటాడు. 7 ఏళ్ల వయసులోనే ఓ ఆవిడను కాపాడే క్రమంలో అతను జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల నుండి ఓ చిన్న డిస్టబెన్స్ తో దూరం అవుతాడు. హైదరబాద్ లో కాలేజ్ లో చదువుతూ మ్యూజిక్ బ్యాండ్ నడిపే తేజ్ లండన్ నుండి ఓ పని మీద వచ్చిన నందినిని ప్రేమిస్తాడు. ఇంతలో ఆమె యాక్సిడెంట్ లో గతం మర్చిపోవడంతో తన ప్రేమని సక్సెస్ చేసుకునేందుకు తేజ్ ఏం చేశాడు అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :

కరుణాకరణ్ సినిమా అనగానే అందరికి గుర్తొచ్చే సినిమా తొలిప్రేమ. అప్పట్లో ఆ సినిమా పెద్ద సెన్సేషన్ ఆ తర్వాత డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలు అలరించాయి. అయితే తను ఎంచుకున్న కథకు ఒకేరకమైన కథనం రాసుకునే కరుణాకరణ్ తేజ్ ఐలవ్యూ సినిమ కూడా అదే రొటీన్ పంథాలో సాగించాడు. 

ముఖ్యంగా సినిమాలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ, లవ్ ఎమోషన్ ఏమాత్రం వర్క్ అవుట్ కాలేదు. సినిమా అంతా ఏదో సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కూడా బోర్ కొట్టేస్తాయి. తొలిప్రేమ, డార్లింగ్ సినిమాల పంథాలో కొనసాగినట్టు అనిపించిన తేజ్ ఆ సినిమాలలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వలేకపోయింది.    

ఎక్కడ సీరియస్ నోట్ అనిపించదు. తేజ్ లాంటి హీరో దొరికినా సరే కరుణాకరణ్ ఆ అవకాశాన్ని సరిగా వాడుకోలేదు. కథ, కథనాల్లో రొటీన్ పంథా కొనసాగించిన తేజ్ ఐలవ్యూ సాయి ధరం తేజ్ ఎకౌంట్ లో మరో ఫెయిల్యూర్ సినిమా అని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

సాయి ధరం తేజ్ నటనలో ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంటుందని తేజ్ ఐలవ్యూ సినిమా చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ లో తేజూ ఇంకా డెవలప్ అవ్వాలి. అనుపమ మాత్రం చాలా అందంగా కనిపించింది. జయప్రకాశ్, అనీష్ కురువిల్లా, పవిత్ర లోకేష్ పాత్రలు కూడా ఎప్పటిలానే నటించారు. వైవా హర్షా, జోష్ రవి ఉన్నా కామెడీ పండలేదు. 

టెక్నికల్ టీం విషయానికొస్తే.. ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. హీరోయిన్ అనుపమని చాలా అందంగా చూపించారు. గోపి సుందర్ మ్యూజిక్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు కరుణాకరణ్ ఏమాత్రం ప్రతిభ కనబరచలేదు. రొటీన్ పంథాలో సాగడమే కాకుండా ఆడియెన్స్ కూడా ఊహించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. డైలాగ్స్ కూడా ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 

ఒక్కమాటలో :

తేజ్ ఐలవ్యూ.. విఫలమైన ప్రేమకథ..!

Related Post