ఈ నగరానికి ఏమైంది రివ్యూ & రేటింగ్

June 29, 2018
img

రేటింగ్ : 2.75/5

కథ : 

నలుగురు స్నేహితుల కథే ఈ సినిమా.. ఇంజినీరింగ్ టైంలోనే దర్శకుడు కావాలన్నా కలతో షార్ట్ ఫిల్మ్ చేయాలని అనుకుంటాడు వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు) అయితే ఆ క్రమంలోనే ఓ అమ్మాయిని ఇష్టపడటం ఆమె ప్రేమ విఫలమవడం జరుగుతుంది. హీరో దేవదాసుగా మారి తాగుడికి బానిసైన టైంలో చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితులు మళ్లీ అతని కలని నిజం చేయాలని చూస్తారు. నచ్చిన పని చేయడంలో ఉండే ఆనందం మరి ఇక ఎందులోనూ ఉండదు అన్న కథతో ఈ సినిమా వచ్చింది.

విశ్లేషణ :

పెళ్లిచూపులు తర్వాత తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఆ సినిమాలానే మెప్పించిందని చెప్పొచ్చు. పాత్రలు పాత్ర స్వభావాలు మన పక్కన జరుగుతున్నట్టే తెరకెక్కించాడు. నలుగురు స్నేహితులు కలిసి సరదాగా మాట్లాడే సంభాషణలు దానికి కాస్త్ ఫన్ యాడ్ చేసి డైలాగ్స్ రాశాడు. 

పెళ్లిచూపులు సినిమాలో ఓ కథ ఉంటుంది. కాని ఈ సినిమాలో కథ వీక్ గా అనిపిస్తుంది. కథనం సాధ్యమైంత వరకు బాగానే లాక్కొచ్చినా సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో దర్శకుడి పెన్ పవర్ మరోసారి ప్రూవ్ అయ్యింది.  

నలుగురు కుర్రాళ్ల కథ అందులో ఫెయిల్యూర్ లవ్ స్టోరీ.. ఇలా తెలిసిన కథగా అనిపిస్తుంది. అందుకే అక్కడక్కడ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా యూత్ ఆడియెన్స్ మెప్పుపొందేలా వచ్చింది. ఆ విషయంలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. 

నటన, సాంకేతిక వర్గం :

వివేక్ (విశ్వజ్ సేన్), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్), ఉపేంద్ర (వెంకటేష్) నలుగురు వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. వివేక్ ది లీడ్ రోల్ కాగా అతని పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేస్తుంది. ఇక కౌశిక్ పాత్రలో అభినవ్ అదరగొట్టాడు. మరోసారి పెళ్లిచూపుల్లో ప్రియదర్శి పాత్రని గుర్తుచేశాడు. ఇక వెంకటేష్, సుశాన్ రెడ్డిలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరీ కూడా మెప్పించారు.

ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. నికెత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమా స్టైలిష్ గా వచ్చేందుకు కెమెరా మెన్ బాగా చేశాడు. వివేక్ సాగర్ పెళ్లిచూపులు మ్యాజిక్ రిపీట్ చేయలేదు. రెండు పాటలే ఉన్నా అవి అంత నోటబుల్ గా అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా కథకు ఎంత కావాలో అంతా పెట్టేశారు. కథ గొప్పగా రాసుకోలేని తరుణ్ భాస్కర్ కథనంలో తన ప్రతిభ చూపాడు. 

ఒక్కమాటలో : 

ఈ నగరానికి ఏమైంది.. యూత్ ను మెప్పించే ప్రయత్నం సక్సెస్ అయినట్టే..! 


Related Post