సమ్మోహనం రివ్యూ & రేటింగ్

June 15, 2018
img

రేటింగ్ : 2.75/5

కథ : 

విజయ్ (సుధీర్ బాబు) చిన్న పిల్లలు ఇష్టపడే బొమ్మలతో కథలను చెప్పే ఆథర్. అతని తండ్రి సర్వేష్ (సీనియర్ నరేష్) రైటైర్డ్ ఎంప్లాయ్.. సినిమాల మీద ఇష్టంతో నటించాలనే కోరిక ఉంటుంది. ఈ టైంలో తమ సినిమా షూటింగ్ కు ఇల్లు ఇస్తే ఛాన్స్ ఇస్తారని తెలుసుకుంటాడు. అలా హీరో ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతుంటుంది. హీరోయిన్ సమీరా (అదితి రావు) తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటే విజయ్ ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఈ టైం లో ఆమెను ప్రేమిస్తాడు విజయ్. ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెబుతాడు కాని సమీరా నో చెబుతుంది. ఇక తర్వాత సమీరా, విజయ్ లు దూరమవుతారు. అసలు సమీరా ఎందుకు విజయ్ ప్రేమను కాదన్నది. విజయ్ సమీరాల ప్రేమ ఫలించిందా లేదా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

అష్టా చెమ్మ నుండి ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. సమ్మోహనం కూడా అంతే.. ఇక ఈమధ్య హాట్ న్యూస్ గా మారిన కాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఈ సినిమాలో ప్రస్థావించారు. ఎంచుకున్న కథను దానికి తగినట్టుగా కథనం రాసుకుని అందంగా తెరకెక్కించాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.

సినిమా తన మార్క్ మూవీగా వచ్చింది. మొదటి భాగం ఎంటర్టైన్ చేయగా సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ, కథనాల్లో సృజనాత్మకత కనిపిస్తుంది. కథానాయిక జీవితాల గురించి అందరు ప్రస్థావించే విషయాలను చూపించారు.   

పరిణితితో చెందిన ప్రేమకథగా సమ్మోహనం చెప్పొచ్చు. అయితే సినిమా స్క్రీన్ ప్లేలో వేగం తగ్గడం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. మిగతా విషయాన్ని సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. 

నటన, సాంకేతిక వర్గం :

సుధీర్ బాబు నటన బాగుంది. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా కనిపించాడు. అదితి రావు కూడా ఇంప్రెస్ చేసింది. తెరమీద తారలా అందంగా కనిపించింది. ఆమె కూడా ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా నటించింది. సీనియర్ నరేష్ సినిమాలో మంచి రోల్ చేశాడు. రాహుల్ రామకృష్ణ పాత్ర ఆకట్టుకుంది.      

సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే..  పిజి విందా సినిమాటోగ్రఫీ బాగుంది.. స్క్రీన్ మీద లీడ్ పెయిర్ అందంగా కనిపించారు. ఇక వివేక్ సాగర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెస్ చేసింది. కథ, కథనాల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మార్క్ కనిపిస్తుంది. అక్కడక్కడ స్లో అయినందన్న భావన తప్ప సినిమా పర్ఫెక్ట్ గా ఉంది. డైలాగ్స్ విషయంలో బాగా వర్క్ అవుట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.   

ఒక్కమాటలో :

సుధీర్ బాబు సమ్మోహనం.. ఆడియెన్స్ మెప్పించేసింది..! 

Related Post