నా.. నువ్వే రివ్యూ & రేటింగ్

June 14, 2018
img

రేటింగ్ : 2/5

కథ :

పి.హెచ్.డి పూర్తి చేసిన వరుణ్ (కళ్యాణ్ రామ్) అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. రెండు మూడుసార్లు ఆ ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ టైంలో ఆర్జేగా పనిచేస్తున్న మీరా (తమన్నా) వరుణ్ ప్రేమలో పడుతుంది. కనీసం అతన్ని డైరెక్ట్ గా చూడకుండానే ఓ బుక్ దొరకడం అందులో అతని ఫోటో చూస్తున్న ప్రతిసారి తనకు లక్ కలిసిరావడం లాంటివి జరగడంతో వరుణ్ అంటే ఇష్టపడుతుంది మీరా. కాని వరుణ్ మాత్రం డెస్టినీని అసలు నమ్మడు. రెండు వేరు వేరు ఆలోచనలు కలిగిన వరుణ్, మీరాల ప్రేమ నెగ్గిందా లేదా అన్నది మిగతా సినిమా కథ.  

విశ్లేషణ :

జయేంద్ర రాసుకున్న ఈ సినిమా కథ ఆల్రెడీ ఓ మాస్ ఇమేజ్ ఉన్న హీరో, పాపులారిటీ ఉన్న హీరోయిన్ కాబట్టి ఆ ఫ్రెష్ నెస్ తెలియలేదు. కళ్యాణ్ రామ్ చేసిన వరుణ్ పాత్ర ఎంత సెటిల్డ్ గా చేసినా అంత కిక్ ఇవ్వలేదు. ఇక చూసేందుకు గ్లామరస్ గా ఉండే మిల్కీ బ్యూటీ తమన్నా అతనికోసం వెంటపడటం లాజిక్ లేకుండా ఉంటుంది. అంతేకాదు హీరో, హీరోయిన్స్ మధ్య సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. 

అసలు లవ్ స్టోరీలో ఉండాల్సిన మ్యాజిక్ ఎక్కడ కనిపించలేదు. కెమిస్ట్రీ వర్క్ అవుట్ కాలేదని చెప్పాలి. మొదటి భాగం సినిమా పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ మరి సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. సినిమాలో కొత్త కళ్యాణ్ రామ్ ను చూడొచ్చు. అయితే ఎక్కడ లాజిక్ లేకపోవడం.. హీరో, హీరోయిన్ ప్రతి సీన్ లో యాదృశ్చికంగా కలవడం అంతా కథనంలో భాగమైనా మరి డ్రమెటిక్ గా అనిపిస్తుంది.  

యూత్ ఆడియెన్స్ మెచ్చే మెలోడీ సాంగ్స్.. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అయితే అవి సినిమాను నిలబెడతాయని మాత్రం చెప్పలేం. కళ్యాణ్ రామ్ తన ఇమేజ్ ను పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. తమన్నా గ్లామర్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. 

నటన, సాంకేతికవర్గం :

కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించాడు. తన పాత్ర కోసం తాను హండ్రెడ్ పర్సెంట్ కష్టపడినట్టు తెలుస్తుంది. సినిమాలో అందరి చూపు తమన్నా మీదే ఉంటుంది. గ్లామర్ తో అదరగొట్టింది తమన్నా. అందం, అభినయం రెండిటిలో మెప్పించింది. తణికెళ్ల భరణి పాత్ర బాగుంది. ప్రవీణ్, ప్రియదర్శి లాంటి వారున్నా కామెడీ మాత్రం పండలేదు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ ఓకే.. ఎందుకో ఆయన కూడా ఈ సినిమాకు అంత కాన్సెంట్రేట్ చేసినట్టు లేడనిపిస్తుంది. శరత్ మ్యూజిక్ బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు చాలా పొరపాట్లు చేశాడు. మరి లాజిక్ లేని కొన్ని సీన్స్ ప్రేక్షకుల అసహనానికి గురయ్యేలా చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

ఒక్కమాటలో :

కళ్యాణ్ రామ్ కొత్త ప్రయత్న నా.. నువ్వే.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది..! 


Related Post