కాలా రివ్యూ & రేటింగ్

June 07, 2018
img

రేటింగ్ : 2.25/5

కథ :

ముంబైలోని మురికివాడ అయిన ధారావి ప్రాంతంలో నివసిస్తున్న వేల మందికి నాయకుడిగా ఉంటాడు కరికాలన్ (రజినికాంత్). సిటీ విస్తరణలో ధారావి ముంబై మధ్యలో ఉంటుంది. దానిపై పొలిటిషియన్ హరిదేవ్ (నానా పటేకర్) కన్ను పడుతుంది. ప్యూర్ ముంబై పేరుతో అక్కడవారిని పంపించి అక్కడ కొత్త కట్టడాలు నిర్మించాలని చూస్తాడు. కాని అందుకు కాలా ఒప్పుకోడు. కాలా మాటే తమ మాటగా అక్కడ ప్రజలు ఉంటారు. ఎలాగైనా ఆ ప్లేస్ ను ఆక్రమించాలన్న దురుద్దేశంతో హరిదేవ్ ఆ ప్రాంత ప్రజలను కాలాని కష్టాలు పెడతాడు. ఫైనల్ గా కాలా అతన్ని ఎలా ఎదుర్కున్నాడు. ధారావిని ఆ పొలిటిషియన్ చెర నుండి ఎలా విడిపించాడు అన్నదే సినిమా కథ.

విశ్లేషణ :

కబాలి తర్వాత రంజిత్ డైరక్షన్ లో రజినికాంత్ చేసిన సినిమా కాలా. కబాలి అంచనాలను అందుకోలేదు కాబట్టి ఈ సినిమా కూడా అలానే ఉంటుందని ఊహించారు. అయితే వారి అంచనాలకు తగినట్టుగానే సినిమా అంత గొప్పగా ఏం లేదు. కాకపోతే కబాలి కన్నా కాస్త బెటర్ అన్నట్టు ఉంటుంది. 

కథ పాతదే.. మురికివాడల్లో నివసించే ప్రజలు ఆ నేలను ఎలా కొలుస్తారు.. దానిపై డేగ కన్నుగా పడిన పొలిటిషియన్ ను ఎలా ఎదుర్కున్నారు అన్నది సినిమా కథ. కథనం కబాలి సినిమాలానే నెమ్మదిగా సాగుతుంది. అయితే ఈసారి రజిని ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేలా అవసరమైనప్పుడల్లా ఫైట్స్, మాస్ అంశాలను యాడ్ చేశాడు. 

అయినా సరే కథనంలో దమ్ము చూపించలేకపోయాడు దర్శకుడు పా. రంజిత్. సినిమాలో సెంటిమెంట్ కూడా పండలేదు. మొదటి భాగం ప్రీ ఇంటర్వల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అవగా కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి. తన పర్మిషన్ లేనిదే ధారావి నుండి వెళ్లలేవని విలన్ కు వార్నింగ్ ఇచ్చిన సీన్ ఆ తర్వాత అక్కడ జరిగేదంతా రజిని ఫ్యాన్స్ కు భలే నచ్చేస్తుంది.

ఫైనల్ గా కబాలి కన్నా కాస్త బెటర్ గా ఉందని చెప్పినా ఎంచుకున్న కథకు ఇంకా బాగా కథనం.. మాటలను రాసుకోవచ్చని అంటున్నారు. ఇక పూర్తి తమిళ నేటివిటీకి తగినట్టుగా కథనం సాగినట్టు అనిపిస్తుంది. మురికివాడల జీవితాలు.. వారి ఇబ్బందులను సినిమాలో చక్కగా ప్రస్థావించారు. 

నటన, సాంకేతికవర్గం :

రజిని సినిమా అంటే ఆయన స్టైల్, ఆయన లుక్ అదరగొట్టడం ఖాయం. కాలాలో కూడా వన్ మ్యాన్ షోతో స్క్రీన్ పై సర్ ప్రైజ్ చేశాడు రజినికాంత్. ఇక నానా పటేకర్ విలనిజం కూడా బాగుంది. నాయకుడికి గట్టి పోటీ ఇచ్చేలా ప్రతి నాయకుడిగా నానా పటేకర్ ఇంప్రెస్ చేశాడు. హ్యూమా ఖురేషి, ఈశ్వరి రావు నటన ఆకట్టుకుంది. సముద్రఖని సినిమా మొత్తం రజిని పక్కనే ఉంటూ అలరించాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. మురళి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కెమెరా వర్క్ అద్బుతంగా ఉంటుంది. కథ, కథనాల్లో దర్శకుడు పా. రంజిత్ మళ్లీ కబాలి పంథానే కొనసాగించాడని చెప్పాలి. కబాలి కన్నా కాస్త బెటర్ గా ఈ సినిమా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. అయితే ఇంకా సన్నివేశానికి తగినట్టుగా డైలాగ్స్ రాసుకునే అవకాశం ఉన్నా మిస్ చేసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ధనుష్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఖర్చు పెట్టాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఒకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తుంది.

ఒక్కమాటలో :

కబాలి లాంటి కాలా.. మళ్లీ ట్రాక్ తప్పేశాడు..!

Related Post