ఆఫీసర్ రివ్యూ & రేటింగ్

June 01, 2018
img

రేటింగ్ : 2/5

కథ :

ముంబైలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసే నారాయణ పసారి ఓ ఫేక్ ఎన్ కౌంటర్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కుంటాడు. ముంబైలో మాఫియానే లేకుండా చేసిన నారాయణ పసారి ఇలా ఎందుకు చేస్తాడో ఎవరికి అర్ధం కాదు. ఇక దీనిపై ఇన్వెస్టిగేషన్ జరిపించేందుకు హైదరాబాద్ నుండి ఐపిఎస్ ఆఫీసర్ శివాజి రావు (నాగార్జున) వస్తాడు. తను నమ్మే నిజం కోసం ఎక్కడిదాకా అయినా వెళ్లే శివాజి రావు నారాయణ పసారిని కలిసిన మొదటి మీటింగ్ లోనే అతనేంటో అర్ధమవుతుంది. పోలీస్ గా ఉంటూనే పసారి చేస్తున్న పనులకు గట్టి దెబ్బ కొట్టాలని చూస్తాడు శివాజి. అది ఎలా సాగింది దాని కోసం ఎవరి సాయం తీసుకున్నాడు..? పసారిని శివాజి ఏం చేశాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

హీరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తను నమ్మే సిద్ధాంతమే తనని కచ్చితంగా గెలిపిస్తుంది అన్న మొండి ధైర్యం ఉన్న వ్యక్తి. తను చేస్తున్న డ్యూటీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని సాహసం అంతని సొంతం. ఇదే విషయాన్ని నాగార్జున పాత్రలో చూపించాడు వర్మ. అయితే విలనిజం మాటల్లో చెప్పినంత చేతల్లో చూపించలేకపోయాడు. విలన్ గా పసారి కనిపించడానికి గంభీరంగా అనిపించినా చివర్లో అతన్ని మాములుగా చంపడం థ్రిల్ ఇవ్వదు.

ఆర్జివి సినిమా అంటే టేకింగ్ పరంగా ఎలాంటి డౌట్ ఉండదు.. ఉన్న సమస్య అల్లా కథ, కథనాలే.. అదేంటో వర్మ ఏ కథ రాసుకున్నా చివరకు అది మాఫియాతో లింక్ ఏర్పడుతుంది. ఆఫీసర్ కథ ఓ ఇద్దరి పోలీసుల మధ్య జరిగే కొట్లాట అందులో ఒకడు దుర్మార్గుడు,. మరొకడు హీరో. 

కథ ఎలా ఉన్నా కథనం అయినా కాస్త బాగుంటుంది అనుకుంటే అది కూడా రెగ్యులర్ వర్మ మార్క్ స్క్రీన్ ప్లేతోనే వచ్చింది. ఇక ఈ సినిమాలో కొన్ని కెమెరా యాంగిల్స్ విచిత్రంగా అనిపిస్తాయి. కొద్దిగా అది ఇందులో ఎక్కువైందని అనిపిస్తుంది. సినిమాలో హీరో పాత్రకు నాగ్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఓపెనింగ్ షాట్ అయితే అదిరిపోతుంది. ఫైనల్ గా శివ, గోవిందా గోవిందా తర్వాత నాగ్, వర్మల కాంబోలో వచ్చిన ఈ ఆఫీసర్ అంచనాలను అందుకోలేదు. 

నటన, సాంకేతికవర్గం : 

ఎలాంటి పాత్రలో అయినా సరే తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న నాగార్జున ఫుల్ యాక్షన్ హీరోగా ఇందులో నటించారు. సినిమాలో కొత్త నాగార్జున కనిపించాడంటే నమ్మాలి. ఇక హీరోయిన్ మైరా సరీన్ కూడా బాగానే చేసింది. బేబీ కావ్య కూడా తన సహజ నటనతో ఆకట్టుకుంది. విలన్ ఫిరోజ్ అబ్బాసి కూడా బాగానే చేశాడు. అజయ్ చిన్న రోల్ లో కనిపించాడు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. భరత్ వ్యాస్, రాహుల్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా చెప్పొచ్చు. వర్మ మార్క్ టేకింగ్ అన్నిచోట్ల కనిపిస్తుంది. రవి శంకర్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాల్లో దర్శకుడు రాం గోపాల్ వర్మ ఇదవరకు సినిమాల కన్నా బెటర్ అని చెప్పినా కథనంలో తన రొటీన్ పంథా సాగించడం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా 1226 నిమిషాలే ఉన్నా అక్కడక్కడ బోర్ కొడుతుంది. పతాక సన్నివేశాలు అంతగా ఆకట్టుకునేలా తీయలేదు. 

ఒక్కమాటలో : 

నాగ్, ఆర్జివి ఆఫీసర్.. ఆకట్టుకోలేదు..!


Related Post