నేల టిక్కెట్టు రివ్యూ & రేటింగ్

May 25, 2018
img

రేటింగ్ : 1.5/5

కథ :

అనాథగా పెరిగిన హీరో (రవితేజ) అందరి చేత నేలట్టికెట్టు అనిపించుకుంటాడు. అలా తన దగ్గరకు సాయం అని వస్తే తప్పక చేసే అతను ఒకానొక విషయంలో హోం మినిస్టర్ ఆదిత్య భూపతి (జగపతి బాబు) మనుషూల్తో పెట్టుకుంటాడు. వారిని కొట్టినా హీరోని లైట్ తీసుకున్న మినిస్టర్ కు అతని ఏకు మేకై కూర్చుంటాడు. ఇక మినిస్టర్ కూడా అతని గురించి తెలుసుకునే సరికి అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు మినిస్టర్ ను టార్గెట్ చేయడానికి అతనెవరు..? మినిస్టర్ కు నేలటిక్కెట్టు కుర్రాడికి సంబంధం ఏంటి అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

నేల టిక్కెట్టు.. టీజర్, ట్రైలర్ చూసేనే ఇందులో విషయం ఏమి లేదన్నట్టు అనుమానం రాగా కనీసం ఆ టీజర్, ట్రైలర్ తగిన అంచనాలను కూడా అందుకోలేదు. రొటీన్ కథ, అదే మార్క్ కథనం ఇలా ఎప్పుడో 80, 90ల మధ్య నలిగే కథకు నేల టిక్కెట్టు అని పెట్టి ప్రేక్షకుల మీదకు వదిలారనిపిస్తుంది.

సినిమాలో రవితేజ ఎనర్జీ కూడా అంతగా కనిపించదు. సినిమా ఏమాత్రం ఆకట్టుకునే కథ కథనాలు కనీసం రవితేజ సినిమాలో ఉండే కామెడీ కూడా ఈ సినిమాలో లేదని చెప్పొచ్చు. మళ్లీ ఇంతోటి సినిమాకు 2 గంటల 45 నిమిషాలు డ్యూరేషన్ ఇంకా ఆడియెన్స్ కు పిచ్చెక్కిస్తుంది.

సినిమా ట్రీట్మెంట్ విషయంలో దర్శకుడు ఏమాత్ర కష్టపడకుండా రొటీన్ గా తెరకెక్కించాడు. మొదటి భాగం హీరో విలన్ ను టార్గెట్ చేయడం ఇంటర్వల్ ట్విస్ట్ ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇలా పరమ రొటీన్ గా కథనంతో వచ్చిన ఈ సినిమాపై ఆడియెన్స్ అసంతృప్తిగా ఉన్నారు. 

నటన, సాంకేతికవర్గం :

రవితేజ ఎనర్జీని సినిమాలో వాడుకోలేదు. అయితే తన పరంగా పాత్రకు న్యాయం చేశాడు రవితేజ. ఇక హీరోయిన్ అయితే అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇదవరకు తన సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్న కళ్యాణ్ కృష్ణ ఈసారి మాత్రం మాళవిక విషయంలో బ్లండర్ మిస్టేక్ చేశాడు. జగపతి బాబు పాత్ర ఆకట్టుకుంది. విలన్ గా తనకు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడతాయి. ప్రవీన్, ప్రియదర్శి, రఘు బాబు, బ్రహ్మానందం లాంటి వారున్నా కామెడీ కూడా అంతగా మెప్పించలేదు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. ముకేష్ జి సినిమాటోగ్రఫీ బాగుంది. శక్తికాంత్ మ్యూజిక్ అసలు ఆకట్టుకోలేదు. ఫిదాతో మంచి మెలోడీస్ ఇచ్చినా రవితేజ నేల టిక్కెట్టుకి న్యాయం చేయలేకపోయాడు. ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేకుండా తీశాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల దర్శకుడేనా ఈ సినిమా తీసింది అనే డౌట్ వస్తుంది. డైలాగ్స్ బాగున్న అవి కాపాడలేదు.  

ఒక్కమాటలో :

రవితేజ నేల టిక్కెట్టు.. టిక్కెట్టు కొత్తదే సినిమానే పాతది..!

 

Related Post