మెహబూబా రివ్యూ & రేటింగ్

May 11, 2018
img

రేటింగ్ : 1.75/5

కథ :

ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోషన్ (ఆకాష్ పూరి) సైనికుడిగా చేరాలన్నది కోరిక. అదే కలగా వస్తూ సరిహద్దుల్లో పోరాడుతున్నట్టుగా అతన్ని కల వెంటాడుతుంది. ఇంతలోనే అతనికి అఫ్రీన్ పరిచయం అవుతుంది. ఆమెను కాపాడే క్రమంలో ఒకరినొకరు చూసుకోరు. ఇక ట్రెక్కింగ్ చేస్తున్న రోషన్ కు గత జన్మ గురించి తెలియడం.. అఫ్రీన్ గత జన్మలో తన ప్రేయసిగా గుర్తించడం జరుగుతుంది. లాహోర్ నుండి హైదరాబాద్ వచ్చిన అఫ్రీన్ రోషన్ ను ప్రేమిస్తుంది. ఇంతలోనే ఇండో పాక్ యుద్ధం జరుగుతుంది. ఇంతకీ రోషన్, అఫ్రీన్ గతజన్మ రహస్యం ఏంటి..? వారి ప్రేమ ఫలించిందా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

పూరి మార్క్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు టీజర్, ట్రైలర్ తో మెహబూబా సినిమా ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి మళ్లీ వారిది జన్మ జన్మల ప్రేమ. గతజన్మలో ప్రేమించుకుని విడిపోయిన వీరు ఈ జన్మలో కలవడమే. అయితే దీనికి ఇండో పాక్ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కించాడు.

మొదటి భాగం హీరో పాత్ర చుట్టూ తిరుగుతూ కథను నడిపించినా గత జన్మ అనేసరికి నీరసం వచ్చేస్తుంది. పూరి కొత్తగా ట్రై చేశాడు అని సంతోషించాలో లేక రొటీన్ గా వచ్చాడు అని బాధపడాలో తెలియదు. రొటీన్ మాఫియా డాన్ కథలకు ఫుల్ స్టాప్ పెట్టినందుకు సంతోషించినా గత జన్మ అంటూ రావడం కాస్త విడ్డూరంగానే ఉంది.

ముఖ్యంగా ఇదో లవ్ స్టోరీ ఫీల్ గుడ్ గా రాసుకోవాల్సిన సీన్స్ కూడా ఆ ఫీల్ కలిగి ఉండవు. లీడ్ పెయిర్ ఎమోషన్ క్యారీ చేయలేదు. హీరో తన ఇమేజ్ కు మించి పాత్ర చేశాడనిపిస్తుంది. ఓవరాల్ గా పూరి మళ్లీ మెహబూబాతో నిరాశ పరచాడు.

నటన, సాంకేతికవర్గం :

సినిమా కోసం దర్శకుడిగా పూరి ఎంత కష్టపడ్డాడో తనయుడు ఆకాష్ పూరి కూడా అంతే కష్టపడ్డాడని చెప్పొచ్చు. ఆంధ్రాపోరితో పోల్చుకుంటే మెహబూబాకి ఆకాష్ విషయంలో చాలా మార్పులు గమనించవచ్చు. హీరోగా అతనికి మంచి మార్కులే పడినట్టే. ఇక హీరోయిన్ నేహా శెట్టి సోసోగానే ఉంది. మురళి శర్మ, షయాజి షిండే పాత్రలు రొటీన్ గానే అనిపిస్తాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి. 

టెక్నికల్ టీం విషయానికొస్తే.. విష్ణు శర్మ కెమెరా వర్క్ బాగుంది. వార్ సీన్స్ లో కెమెరా పనితనం అద్భుతం. సందీప్ చౌతా చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేశాడు. రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. కథ కొత్తగా రాసుకున్నా దాన్ని తెరమీద చూపించడంలో మాత్రం పూరి ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. 

ఒక్కమాటలో :

పూరి మార్క్ మిస్సైన మెహబూబా..! 

Related Post