ఆచారి అమెరికా యాత్ర రివ్యూ & రేటింగ్

April 27, 2018
img

రేటింగ్ : 2/5

కథ :

కృష్ణమాచారి (మంచు విష్ణు) తన గురువు అప్పలాచారి (బ్రహ్మానందం)తో కలిసి రాజు (ప్రదీప్ రావత్) ఇంట్లో హోమం చేస్తారు. ఈ క్రమంలో అక్కడ అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఈలోగా కృష్ణమాచారికి రేణుక (ప్రగ్యా జైశ్వాల్) చూడగానే నచ్చేస్తుంది. ఆమె కోసం అమెరికా వెళ్లాలని అనుకుని అర్చక బృందం మొత్తాన్ని అమెరికాకు తీసుకెళ్తాడు. అక్కడకు వెళ్లాక కాని అసలు విషయం తెలియదు. ఈలోగా విలన్ గ్యాంగ్ కృష్ణమాచారిని వెత్తుకుంటూ వస్తారు..? అసలు ఇంతకీ చారి ఎందుకు అమెరికాకు వెళ్లాడు. విలన్ గ్యాంగ్ అతని కోసమే వచ్చారా లేక వేరే వాళ్ల కోసమా..? రేణుక చారి ప్రేమను అంగీకరించిందా లేదా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

కథ ఎలా ఉన్నా కామెడీతో నడిపించడం అదో ఆర్ట్. జి.నాగేశ్వర్ రెడ్డికి అందులో మంచి టాలెంట్ ఉందని నమ్ముతారు. తన సినిమా కథలు రొటీన్ గా అనిపించినా కథనంలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయితే ఆచారి విషయంలో కథనం కూడా రొటీన్ గా సాగించాడు దర్శకుడు. అసలు ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో వచ్చాడు.

మొదటి భాగం వరకు కాస్త పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ మరి సాగదీతగా సోదిగా అనిపిస్తుంది. ఒకానొక పరిస్థితిలో ఆడియెన్స్ పేషెన్సీని టెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రగ్యా అందాలు, వచ్చి పోతున్న సాంగ్స్ ఇలా ఎన్ని వచ్చినా సినిమా మీద ఆడియెన్స్ దృష్టి పెట్టేదిగా ఉండదు.

విష్ణుతో ఆడోరకం ఈడోరకం సినిమా హిట్ కొట్టిన నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో వస్తుందని ఆశించారు. కాని విఫలమయ్యాడు. కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదాలు పడుతూ వచ్చిన ఆచారి అమెరికా యాత్ర ఫైనల్ గా ఫెయిల్యూర్ అటెంప్ట్ అని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

మంచు విష్ణు తన మార్క్ కామెడీ పండించాడని చెప్పొచ్చు. అయితే హీరో క్యారక్టరైజేషన్ లో కూడా దర్శకుడి పట్టు సాధించలేదు. ప్రగ్యా అందాలు సినిమాకు ప్లస్సే. ఆమె వరకు ఓకే అనిపించుకుంది. బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ రోల్ సినిమాను ఏమాత్రం కాపాడలేదు. ఏవో కొన్ని తప్ప మిగతా అంతా రొటీన్ కామెడీనే. ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, పోసాని, పృధ్వి ఇలా కాస్టింగ్ పెద్దదే అయినా లాభం లేదు. ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్ విలనిజం పర్వాలేదు. 

టెక్నికల్ టీం విషయానికొస్తే.. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫారిన్ లొకేషన్స్ అందంగా చూపించారు. తమన్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. లాజిక్ లేని కథ, గ్రిప్పింగ్ ఏమాత్రం లేని కథనంతో దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి ప్రతిభ కనబరచలేదు.

ఒక్కమాటలో : 

మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర.. ఏమాత్రం ఆకట్టుకోలేని ప్రయత్నం..!


Related Post