భరత్ అనే నేను రివ్యూ & రేటింగ్

April 20, 2018
img

రేటింగ్ : 3.75/5

కథ :

ఆక్స్ ఫోర్డ్ లో డిగ్రీ చేసిన భరత్ రామ్ (మహేష్ బాబు) తండ్రి చనిపోయాడన్న వార్తను విని ఇండియాకు వస్తాడు. తండ్రి తర్వాత సిఎం కుర్చిని తానే ఎక్కాలని రాజకీయ సలహాదారుడు వరద రాజు (ప్రకాశ్ రాజ్) సలహా మేరకు సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక అక్కడి నుండి ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తాడు. రాజకీయ వ్యవస్థను మార్చేలా భరత్ తీసుకునే నిర్ణయాలు సమస్యల్లో పడేస్తాయి. ఇంతకీ భరత్ అనుకున్నది సాధించాడా..? ఈ పోరాటంలో అతను ఎదుర్కున్న సమస్యలేంటి..? వాటిని ఎలా అధిగమించాడు అన్నదే అసలు కథ.  

విశ్లేషణ :

భరత్ అనే నేను.. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ప్రస్తుతం సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్థావిస్తూ.. ఆ కథకు కమర్షియల్ హంగులను అద్దాడు దర్శకుడు కొరటాల శివ. మొదటి భాగం అంతా సరదాగా సాగగా సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంగేజింగ్ గా ఉంటుంది.

అయితే రన్ టైం కాస్త ఇబ్బంది పెడుతుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టినట్టు అనిపించదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ప్రెస్ మీట్ లో ప్రస్తుతం మీడియా చేసే అతిని కూడా ఎడగడతాడు భరత్. స్టార్ సినిమా కథాబలం ఉంటే ఆ లెక్కే వేరు. అందుకే మిర్చి నుండి భరత్ అనే నేను వరకు కొరటాల శివ హిట్లు కొడుతూనే ఉన్నాడు. 

ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమాగా భరత్ అందరి మనసులను గెలిచాడు. కథ, కథనాల్లో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినదిగా ఉంటుంది. కంటెంట్ తో పాటుగా కమర్షియల్ అంశాలకు పెద్ద పీఠ వేశారు. 

నటన, సాంకేతిక వర్గం :

భరత్ పాత్రలో మహేష్ మరోసారి అద్భుతమైన నటన కనబరిచాడు. పొలిటికల్ లీడర్ అయినా చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ చాలా అందంగా ఉన్నాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు మహేష్. కియరా అద్వాని కూడా అలరించింది. అయితే సినిమాలో తన పాత్ర చిన్నదే అని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, సితార, అజయ్, రావు రమేష్ పాత్రలు ఆకట్టుకున్నాయి.

ఇక భరత్ అనే నేను టెక్నికల్ టీం విషయానికొస్తే.. రవి కె చంద్ర, తిరు సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నయి. కథ శ్రీహరి నానుదే అయినా కొరటాల శివ దర్శకత్వంతో సినిమాగా బాగా వచ్చింది.

స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టించదు అయితే అక్కడక్కడ కాస్త స్లో అనిపిస్తుంది. లీడ్ పెయిర్ రొమాన్స్ కూడా అంతగా లేదని చెప్పొచ్చ్హు. మంచి కథతో కొరటాల శివ మహేష్ భరత్ సినిమా తీశాడు.

ఒక్కమాటలో :

మహేష్ 'భరత్ అనే నేను'.. ఇలాంటి సిఎం ఉంటే ఇక తిరుగే ఉండదు..! 

Related Post