కృష్ణార్జున యుద్ధం రివ్యూ & రేటింగ్

April 12, 2018
img

రేటింగ్ : 2.75/5

కథ :

చిత్తూరులో సరదా సరదాగా జీవనం సాగిస్తూ ఎవర్నో ఒకర్ని లైన్ లో పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న కృష్ణ (నాని) హైదరాబాద్ నుండి వచ్చిన రియా (రుక్సర్ మిర్)ను చూసి ప్రేమిస్తాడు. కృష్ణ అమాయకత్వానికి రియా కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇదిలా ఉండగా అర్జున్ (నాని) ప్రాగ్ లో రాక్ స్టార్ గా ఉంటాడు. ప్లే బోయ్ గా ఉన్న అర్జున్ కాస్త సుబ్బలక్ష్మిని (అనుపమ) ను చూడగానే కనెక్ట్ అవుతాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్.. కృష్ణ, అర్జున్ ఇద్దరి హీరోయిన్స్ కనిపించకుండా వెళ్తారు. అప్పుడు కృష్ణ, అర్జున్ లు ఏం చేశారు. వారిని ఎలా కనిపెట్టారు. అసలు వారిని కిడ్నాప్ చేసింది ఎవరు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఈ సినిమాతో మళ్లీ కమర్షియల్ అటెంప్ట్ చేశాడని చెప్పాలి. మాస్ ఫాలోయింగ్ కోసం చేసిన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఇక సినిమా దర్శకుడు మేర్లపాక గాంధి మొదటి భాగం అంతా మంచి ఎంటర్టైనింగ్ గా సాగించాడు. కాని సెకండ్ హాఫ్ మాత్రం సీరియస్ మోడ్ లో కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. 

ముఖ్యంగా కృష్ణ పాత్రకు రాసుకున్న చిత్తూరు యాస బాగా వర్క్ అవుట్ అయ్యింది. అసలు సినిమాలో హీరో ఎందుకు రెండు పాత్రలు వేశాడు అన్నది అర్ధం కాదు. ఇదే కథ సింగిల్ క్యారక్టర్ తో చెప్పినా చెప్పొచ్చనిపిస్తుంది. నాని రెండు పాత్రల్లో బాగా చేశాడు. కృష్ణ పాత్ర ఎక్కువ ఆకట్టుకోగా అర్జున్ పాత్రకు అంతగా సూట్ అవలేదని చెప్పొచ్చు.

ఫైనల్ గా ఎక్స్ ప్రెస్ డైరక్టర్ మేర్లపాక గాంధి తన రొటీన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా కథ రాసుకున్నాడు. సినిమా చూసే ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగబోతుందో ఊహించేసేలా ఉంటుంది. కథ, కథనాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఎంటర్టైనర్ గా మాత్రం ఓకే అని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

నాని డ్యుయల్ రోల్ లో అదరగొట్టాడు. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడు. సినిమాలో కృష్ణ పాత్ర ఎక్కువ ఇంప్రెస్ చేస్తుంది. అనుపమ మాములుగానే అనిపిస్తుంది. రుక్సర్ మిర్ మాత్రం బాగా ఆకట్టుకుంది. మహేష్ విట్ట తన మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కచ్చితంగా ఇది అతనికి మంచి గుర్తింపు తెస్తుంది. బ్రహ్మాజి కూడా రెగ్యులర్ పాత్రల్లానే అలరించాడు.

కృష్ణార్జున యుద్ధం టెక్నికల్ టీం విషయానికొస్తే.. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే ప్రాగ్ లొకేషన్స్ ఇంకాస్త బాగా తీయాల్సింది. హిప్ హాప్ తమిజ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ జాగ్రత్త పడాల్సింది. మేర్లపాక గాంధి డైరక్షన్ ఓకే కథ, కథనం రొటీన్ గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి.

ఒక్కమాటలో : 

రొటీన్ గానే అనిపించే కృష్ణార్జున యుద్ధం..!


Related Post