రంగస్థలం రివ్యూ & రేటింగ్

March 30, 2018
img

రేటింగ్ : 3/5

కథ :

రంగస్థలం ఊరిలో 30 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా ఉన్న మహేంద్ర భూపతి (జగపతి బాబు) అక్కడ సొసైటీ పేరుతో ప్రజలను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. ఆ ఊరిలో ఇంజిన్ ఆపరేటర్ గా చిట్టిబాబు (రాం చరణ్) అందరితో కలుపుకోలుగా ఉంటాడు. వినికిడి సమస్య ఉన్న చిట్టిబాబుకి అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి) అంటే బాగా ఇష్టం. ఈ క్రమంలో ప్రెసిడెంట్ అరాచకాలకు అడ్డుగా కుమార్ బాబు ప్రెసిడెంట్ నోటిఫికేషన్ వేస్తాడు. అందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ రాజ్ సపోర్ట్ దొరుకుతుంది. ఫైనల్ గా రంగస్థలం ప్రెసిడెంట్ గద్దె మీద ఎవరు నిలబడ్డారు. మధ్యలో కథలో ఎన్ని ట్విస్టులు వచ్చాయి అన్నది తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

సుకుమార్ ఎప్పుడైతే రంగస్థలం అని ఎనౌన్స్ చేశాడో అప్పటి నుండే సినిమా మీద అంచనాలు పెరిగాయి. రాం చరణ్ చిట్టిబాబుగా సరికొత్త మేకోవర్ చూపించాడు. కథ పాతదే అయినా కథనం కాస్త బాగుండటంతో రంగస్థలం ప్రేక్షకులను మెప్పించే సినిమా అయ్యింది. ముఖ్యంగా రాం చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

సినిమా మొదటి భాగం చాలా సరదాగా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ ఉన్నా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. మళ్లీ క్లైమాక్స్ లో సెట్ అవుతుంది. సుకుమార్ సినిమాలకు ఎప్పుడూ ఉండే నిడివి సమస్య ఈ సినిమాకు వచ్చింది. సినిమా దాదాపు 179 నిమిషాల పాటు ఉంది. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా సాగించడం లో సక్సెస్ అయ్యాడు డైరక్టర్ సుకుమార్.

ఫస్ట్ క్లాస్ మాస్ ఎంటర్టైనర్ గా సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించిన సినిమా రంగస్థలం. రాం చరణ్ లుక్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని సినిమాకు హెల్ప్ అయ్యాయి. పూజా హెగ్డే జిగేల్ రాణి అంతగా క్లిక్ అవ్వలేదు. సినిమా ప్రతి ఫ్రేం లో రిచ్ నెస్ కనబడుతుంది. మెగా అభిమానులకు పండుగలాంటి సినిమా ఇది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా నచ్చే సినిమా అవుతుంది. రన్ టైం సమస్య కాస్త ఇబ్బంది పెడుతుంది.

నటన, సాంకేతికవర్గం :

రాం చరణ్ చిట్టిబాబు పాత్రలో అదరగొట్టాడు. చరణ్ సహజ నటన మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సగటు సిని అభిమానికి సర్ ప్రైజ్ అయ్యేలా చేస్తుంది. చిట్టిబాబుగా చరణ్ 100 పర్సెంట్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఇక సమంత కూడా తన సహజ నటనతో ఆకట్టుకుంది. జగపతి బాబు ప్రెసిడెంట్ పాత్రలో ఎప్పటిలానే ఇంప్రెస్ చేశాడు. ఆది పినిశెట్టి రోల్ కూడా పెద్దదే సినిమాలో అతను కూడా బాగా చేశాడు. అనసూయ రోల్ పెద్దదే.. తన నటనతో ఆకట్టుకుంది అనసూయ. ఇక ప్రకాశ్ రాజ్ కూడా పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ మహేష్, సీనియర్ నరేష్, రోహిణిలకు మంచి పాత్రలో దొరికాయి.

ఇక రంగస్థలం టెక్నికల్ టీం విషయానికొస్తే.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కాగా.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఆర్ట్ పరంగా కూడా సినిమా బాగా వచ్చింది. అచ్చం పల్లెటూరు ఫీల్ వచ్చేలా అక్కడక్కడ సిజి వర్క్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేస్తే బాగుండేది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గా ఉన్నాయి. కథకు ఎంత అవసరమో అంత భారీ ఖర్చు పెట్టేశారు. 

ఒక్కమాటలో :

రంగస్థలం.. రాం చరణ్ వన్ మ్యాన్ షో..! 


Related Post