తొలిప్రేమ రివ్యూ & రేటింగ్

February 10, 2018
img

రేటింగ్ : 2.75/5

కథ :

ట్రైన్ జర్నీలో వర్ష (రాశి ఖన్నా)ను చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు ఆదిత్య (వరుణ్ తేజ్). కాస్త కోపం ఎక్కువగా ఉండే ఆదిత్య.. మనసులో ఏది అనిపిస్తే అది ఏమాత్రం మొహమాట పడకుండా చెప్పేస్తాడు. ఇక ట్రైన్లోనే వర్షకు ప్రపోజ్ చేసే ఆదిత్య ఆమెను నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటాడు. ఇక చెప్పాపెట్టకుండా ఆదిత్యకు తెలియకుండా ట్రైన్ దిగి వెళ్లిన వర్ష ఆ తర్వాత సేం కాలేజ్ లో కలుస్తారు. అక్కడ వారిద్దరు గొడవపడి విడిపోతారు.. ఆ తర్వాత 6 ఏళ్లకు కలుస్తారు. ఇద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి..? ఆదిత్య, వర్షల లవ్ సక్సెస్ అయ్యిందా..? అన్నది అసలు కథ.  

విశ్లేషణ :

కథ పాతదే అన్నట్టు అనిపించినా కథనంలో కాస్త లవ్ అండ్ ఎమోషనల్ ఫీల్ ఉంది.. వరుణ్ తేజ్ క్యారక్టరైజేషన్ సినిమాకు ప్లస్ అవుతుంది. మొదటి భాగం అంతా యూత్ ఫుల్ సీన్స్ తో లవ్ ఫీల్ తో నడిపించిన వెంకీ అట్లూరి సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా చూపించాడు. పాత్రలన్ని ప్రేక్షకులు సినిమా చూసే కొద్దిసేపటికే ఎంగేజ్ అవుతారు.

కథనంలో ఫీల్ తో పాటు ఫన్ ఎలిమెంట్ కూడా బాగానే ఉంది. సినిమా అంతా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా నడుస్తుంది. కథ గురించి ఆలోచిస్తే మాత్రం కష్టమే. లీడ్ పెర్యిర్ సీన్స్ అన్ని చాలా రీఫ్రెషింగ్ గా రాసుకున్నారు. అయితే ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది. యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా సినిమా ఉంది. ఫిదా తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కు మరో సక్సెస్ వచ్చినట్టే. 

నటన, సాంకేతిక వర్గం :

వరుణ్ తేజ్ ఫిదా తర్వాత డిఫరెంట్ క్యారక్టరైజేషన్ తో అలరించాడు. సినిమా సినిమాకు తన నటనలో పరిణితి కనబడుతుంది. రాశి ఖన్నా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది. ఇక ప్రియదర్శి ఫుల్ లెంగ్త్ రోల్ బాగానే హ్యాండిల్ చేశాడు. హైపర్ ఆది రోల్ కాసేపు నవ్విస్తుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఫారిన్ లొకేషన్స్ అన్ని అందంగా చూపించారు. తమన్ మ్యూజిక్ అలరించింది. వెంకీ అట్లూరి డైరక్షన్ ఇంప్రెస్ చేసింది. కథ రొటీన్ గా అనిపించగా.. కథనం కాస్త ఎంగేజింగ్ గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.  

ఒక్క మాటలో : 

వరుణ్ తేజ్ తొలిప్రేమ.. ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్..!


Related Post