ఛలో రివ్యూ & రేటింగ్

February 02, 2018
img

రేటింగ్ : 2.75/5

కథ :

చిన్నప్పటి నుండి గొడవలంటే ఇష్టం ఉండే క్యారక్టర్ కలిగిన హరి (నాగ శౌర్య). తల్లిదండ్రులు తన గొడవలకు అలవాటు పడటం కామన్ అవుతుంది. అయితే తన తిక్క కుదిర్చేందుకు ఆల్రెడీ గొడవలతో ఉన్న ఊళ్లో వేస్తే బెటర్ అని ఆలోచించి తిరుప్పురంకు పంపిస్తారు. 1953లో తమిళనాడు నుండి ఏపి విడిపోయిన టైంలో తిరుప్పురం ఊరు మధ్యలో విభజన రేఖ వెళ్తుంది. అక్కడ వారు తెలుగు వాళ్లు అటెళ్లినా.. తమిళం వాళ్లు ఇటొచ్చినా వారి అంతు చూస్తారూ. ఎన్నాళ్ల నుండో గొడవలు పడుతున్న ఈ ఊరికి హరి వచ్చి తెలుగు కుర్రాడే అయినా తమిళ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక అక్కడ నుండి సినిమా మరో టర్న్ తీసుకుంటుంది. ఇక తన ప్రేమను గెలిపించడం కోసం ఊరినే ఒకటిగా చేయాలని ప్రయత్నం చేస్తాడు హీరో. అసలు ఇంతకీ తిరుప్పురం ఎందుకు చీలిక ఏర్పడింది..? ప్రేమను గెలిపించుకోవడం కోసం హీరో వారిని ఎలా కలిపాడు..? హీరో హీరోయిన్ ప్రేమ ఫలించిందా అన్నది అసలు కథ.

విశ్లేషణ : 

మొదటి సినిమా ఎలాగైనా ఇంప్రెస్ చేయాలన్న తపన ఛలో డైరక్టర్ వెంకీ కుడుములలో కనబడ్డాయి. కథ అంతగా కొత్తగా ఏమి అనిపించదు.. తన ప్రేమ కోసం చీలిన ఒక ఊరిని ఒకటిగా చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఇదవరకు ఇదే కథ రెండు ఊళ్ల మధ్య గొడవ.. గొడవలు కట్టుబాట్లు లాంటివి వచ్చాయి. ఛలోలో ఒకే ఊరు.. తెలుగు, తమిళం అన్న విధంగా కథ రాసుకున్నారు.

కొన్ని సీన్స్ లో తెలుగు వాళ్లను ఎక్కువ చేసినట్టు అవుతుంది. అయినా సినిమాకు ముందే కల్పితం అని వేశారు కాబట్టి పర్వాలేదు. దర్శకుడు కథ కథనాలను ఎంటర్టైనింగ్ మోడ్ లో తీసుకెళ్లిన విధానం బాగుంది. కథలో ఏమంత దమ్ము లేకపోయినా కథనం నడిపించిన తీరు ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా లీడ్ పెయిర్ మధ్య సీన్స్ ఆకట్టుకున్నాయి. కామెడీ ట్రాక్ లా కాకుండా కథలో వచ్చేలా చేశారు. 

ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగగా.. సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ గా నడుస్తుంది. అయితే అందులోనూ ఫన్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు డైరక్టర్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా లవ్ అండ్ కామెడీ సీన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది ఛలో.

నటన, సాంకేతికవర్గం :

నాగ శౌర్య మంచి ఈజ్ తో నటించాడు. పాత్రకు తగిన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని నడిపించాడు. ఇక హీరోయిన్ గా రష్మికకి తెలుగులో మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో తెలుగు ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది ఈ అమ్మడు. ఇక నరేష్, ప్రగతి పాత్రలు ఎప్పటిలానే ఆకట్టుకోగా.. వైవా హర్ష, సత్య, వెన్నెల కిశోర్, పోసాని, ప్రవీణ్ పాత్రలు అలరించాయి. 

ఛలో టెక్నికల్ టీం విషయానికొస్తే.. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సాగర్ స్వర మహతి సంగీతం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. డైరక్టర్ గా వెంకీ తన ప్రతిభ కనబరిచాడు. కథ, కథనాల్లో ఎక్కడ కన్ ఫ్యూజ్ లేకుండా ఇంప్రెస్ చేశాడు. అయితే సినిమా అంతా మరి కామెడీగా నడిపించడం కొందరికి నిరాశ అనిపిస్తుంది. చివరి దాకా తీసుకొచ్చి ఊరు చీలిపోయిన అంశం కూడా ఓ కామెడీగా చేయడం నచ్చదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

ఛలో నాగ శౌర్యను నిలబెట్టే సినిమా..! 


Related Post