టచ్ చేసి చూడు రివ్యూ & రేటింగ్

February 02, 2018
img

రేటింగ్ : 1.75/5

కథ :

కార్తికేయ (రవితేజ) కుటుంబ బాగోగులు చూసుకుంటూ పాండిచ్చేరిలో ఉంటాడు. అక్కడ తన పనికి సెల్వం అడ్డొస్తున్నా సరే తను సైలెంట్ గా ఉంటాడు. ఇక ఓ మర్డర్ మిస్టరీలో తన చెల్లి ఇరుక్కోగా ఆమెను కాపాడే క్రమంలో అసలు తానేంటో చూపిస్తాడు. ఆ తర్వాత పోలీస్ గా కార్తికేయ చార్జ్ తీసుకుంటాడు. ఇంతకీ కార్తికేయ ఎందుకు పోలీస్ డ్యూటీ వదిలేశాడు..? ఇర్ఫాన్ లాలాతో కార్తికేయకున్న గొడవలేంటి..? కార్తికేయ జీవితంలో పప్పు, దివ్యలు ఎవరు..? అన్నది అసలు సినిమా కథ.

విశ్లేషణ :

వక్కతం వంశీ అందించిన టచ్ చేసి చూడు కథ పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథలాతో దర్శకుడు విక్రం సిరి విఫలమయ్యాడు. హీరో ఓ ఏరియాలో విలన్ తో ఫైట్ చేయడం.. ఇదంతా ఎందుకని కుటుంబం కోసం ఊరు వదలడం.. మళ్లీ ఫ్లాష్ బ్యాక్ తోడి యధావిధిగా తన వయిలెన్స్ స్టార్ట్ చేయడం. ఇది చాలా తెలుగు సినిమాల్లో చూసేవే. మళ్లీ ఇదే కథతో టచ్ చేసి చూడు వచ్చింది.

అయితే ఇక్కడ ఆకట్టుకునేలా చేయాల్సిన కథనం కూడా ఏదో అలా కానిచ్చేశారు. సినిమాలో ఏది పర్ఫెక్ట్ గా అనిపించదు. మొదటి భాగం అంతా టైం పాస్ గా నడిపించినా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ గా అనిపించగా.. కేవలం కొన్ని యాక్షన్ సీన్స్ లో మాత్రమే మెప్పిస్తుంది. రవితేజ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అంశాలేవి సినిమాలో లేవని చెప్పాలి. 

రొటీన్ కథ.. దానికి తగినట్టుగానే రొటీన్ కథనం.. రవితేజ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచేలా సినిమా అవుట్ పుట్ ఉంది. పవర్ ఫుల్ టైటిల్ తో మాస్ హిట్ కొడతాడనుకున్న రవితేజ ఫ్యాన్స్ కు ఈ సినిమా నిరాశలో పడేసింది.

నటన, సాంకేతికవర్గం :

రవితేజ పాత్రలో ఏమంత కొత్తదనం అనిపించలేదు. అయితే చేసినంతలో బాగా చేశాడు. లుక్ పరంగా బాగున్నాడు. రాశి ఖన్నా, సీరత్ కపూర్ ల పాత్రలు అంతంత మాత్రమే. సుహాసిని కొద్దిపాత్రే అయినా ఆకట్టుకుంది. మురళి శర్మ, జయ ప్రకాశ్ పాత్రలు ఆకట్టుకున్నాయి. విలన్ ఫ్రెడ్డీ దారువాలా లుక్స్ ఓకే కాని అతనికి తగిన ప్రాధాన్యాత లేదని చెప్పాలి. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. వక్కంతం వంశీ కథ పాతదే.. జాంబ్ 8 మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేయలేదు. మణిశర్మ మ్యూజిక్ కూడా తేలిపోయింది. సినిమాటోగ్రఫీ కొంత పర్వాలేదు. విక్రం సిరి డైరక్షన్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.

ఒక్కమాటలో :

రవితేజను టచ్ చేయకుండా ఉంటే బెటర్..!


Related Post