జై సింహా రివ్యూ & రేటింగ్

January 12, 2018
img

రేటింగ్ : 2.25/5

కథ :

వైజాగ్ నుండి వచ్చిన జై నరసింహా (బాలకృష్ణ) కుంభకోణంలో అతను ఉంటున్న యజమాని కూతురు విలన్ తమ్ముడిని యాక్సిడెంట్ చేయగా ఆ నేరాన్ని తన మీద వేసుకుంటాడు నరసింహా. ఇక అక్కడ విలన్ తో డీ కొట్టే సమయంలో అతనికి తననుండి దూరం వెళ్లిన గౌరి (నయనతార) కనబడుతుంది. నరసింహా గౌరి ఇద్దరు ప్రేమించుకున్నా సరే పరిస్థితులు వారిని విడదీస్తాయి. గౌరిని కాకుండా నరసింహా మంగ (హరిప్రియ)ను పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ నరసింహా ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? గౌరిని అతను ఎలా మిస్ అయ్యాడు..? విలన్ నరసింహాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు అన్నదే సినిమా కథ.

విశ్లేషణ :

కొద్దిరోజులుగా మాస్ సినిమాలకు దూరంగా ఉన్న బాలకృష్ణ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా జై సింహా. మొదటి భాగం సరదా సరదాతో పాటుగా బాలయ్య మార్క్ డైలాగ్ పవర్ తో ఈ సినిమా వచ్చింది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కువ సెంటిమెంట్, వయిలెన్స్ పెట్టేసరికి నిరాశ కలిగించింది.  

కథ కూడా అంత కొత్తగా ఏమి అనిపించదు. బాలయ్య మార్క్ సినిమాగా వచ్చిన ఈ జై సింహా పక్కా మాస్ ఆడియెన్స్ కు నచ్చే సినిమా. అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ కు బాగా ఎక్కేస్తుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేకపోగా కొద్దిగా బోర్ కొట్టించేలా ఉంటుంది. కథ కథనాలన్ని పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. బాలయ్య కాబట్టి సినిమాలో ఎమోషన్ క్యారీ అయ్యిందని చెప్పొచ్చు. ఫ్యామిలీకి చెప్పలేం కాని బి, సి సెంటర్స్ లో మాత్రం జై సింహా కచ్చితంగా మంచి టాక్ తెచ్చుకునే అవకాశం ఉంది. 

నటన, సాంకేతికవర్గం : 

బాలకృష్ణ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. తనకు మాత్రమే సూట్ అయ్యే డైలాగ్స్ తో అలరించాడు. నయనతార అభినయంతో ఆకట్టుకోగా హరిప్రియ రోల్ తక్కువే అయినా ఇంప్రెస్ చేసింది. నటాషా దోషిది అంత చెప్పుకునే పాత్ర కాదని చెప్పొచ్చు. అశుతోష్ రాణా విలనిజం బాగుంది. అయితే పాత్ర ముగింపు సరిగా అనిపించదు. ఇక బ్రహ్మానందం కామెడీ పర్వాలేదు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. రత్నం కథా మాటలు సినిమాకు ఆయువు పట్టు. చిరంతన్ భట్ మ్యూజిక్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రవికుమార్ డైరక్షన్ పర్వాలేదు. అయితే మాస్ ఎలిమెంట్స్ లో వయిలెన్స్ ఎక్కువయినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

బాలకృష్ణ జై సింహ..  మాస్ ఆడియెన్స్ కోసమే..!

Related Post