ఒక్క క్షణం రివ్యూ & రేటింగ్

December 28, 2017
img

రేటింగ్ :

2/5

కథ :

జీవా (అల్లు శిరీష్), జ్యోష్న (సురభి) ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే వీరి లైఫ్ లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ జోష్న ఇంటి ఎదురుగా ఉన్న లైఫ్ లో జరుగుతుంది. శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్) స్వాతి (సీరత్ కపూర్)లు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఒకరోజు సడెన్ గా స్వాతి చనిపోవడంతో ఆ నింద శ్రీనివాస్ పై పడుతుంది. అయితే వారి లైఫ్ లానే తమ జీవితం నడుస్తుండటంతో జీవా కూడా జ్యోని ఏదో ఒకరోజు చంపేస్తాడని అనుకుంటుంది. అసలు ఇంతకీ ఈ పార్లర్ లైఫ్ కాన్స్పెట్ ఏంటి..? స్వాతిని నిజంగానే శ్రీనివాస్ చంపాడా..? లవ్ వర్సెస్ డెస్టినీ ఫైట్ లో ఎవరు గెలిచారు అన్నది అసలు కథ.

విశ్లేషణ :

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తన ప్రతిభ చాటుకున్న దర్శకుడు విఐ ఆనంద్ ఒక్క క్షణం అంత గ్రిప్పింగ్ గా తీయలేదని చెప్పాలి. పార్లర్ లైఫ్ అంటూ చెప్పుకొచ్చినా సరే అసలు సినిమాలో అది అంతగా ప్రభావితం చూపదు. ఇక కథ కథనాల మీద అంత గ్రిప్పింగ్ లేదని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సోసోగానే ఉంటుంది.

అయితే ఇంటర్వల్ లో కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ సినిమాకు అంత పెద్ద హెల్ప్ అవలేదు. క్లైమాక్స్ సీన్స్ కూడా బోర్ కొట్టించేస్తాయి. విలనిజం, ట్విస్ట్ రివీల్ అన్ని ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది. కథలో ఉన్న విషయాన్ని కథనంలో చూపించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. 

అల్లు శిరీష్ ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇవాల్సి ఉంది. కాస్టింగ్ కూడా కాస్త నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎంగేజ్ చేసినట్టుగా ఒక్క క్షణం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 

నటన, సాంకేతిక వర్గం :

నటన పరంగా అల్లు శిరీష్ జస్ట్ ఓకే. ఇంకాస్తా హోం వర్క్ చేయాల్సి ఉంది. సురభి నటన బాగుంది. అమ్మడు స్కిన్ షో కూడా అదరగొట్టింది. ఇక సినిమాలో లీడ్ పెయిర్ తో పాటుగా సమానంగా అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ లు నటించారు. శ్రీనివాస్ బాగా నటించాడు. సీరత్ కు మంచి పాత్ర పడింది. ఇక సినిమాలో విలన్ గా నటించిన అరుణ్ కుమార్ కూడా ఇంప్రెస్ చేశాడు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. దర్శకుడు కథ బాగానే రాసుకున్నా కథంలో తేలగొట్టాడని చెప్పొచ్చు. సినిమా సెకండ్ హాఫ్ హైలెట్ అవ్వాల్సిన ఎపిసోడ్స్ నిరాశ పరచాయి. అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

అల్లు శిరీష్ ఒక్క క్షణం.. సగమే మెప్పించాడు..! 

Related Post