హలో రివ్యూ & రేటింగ్

December 22, 2017


img

రేటింగ్ : 2.75/5

కథ : 

శీను అలియాస్ అవినాష్ (అఖిల్) చిన్నతనంలో తను దూరమైన జున్ను అలియాస్ ప్రియ (కళ్యాణి ప్రియదర్శిని) గురించి వెతుకుతుంటాడు. జున్ను దూరమవుతూ ఇచ్చిన 100 రూపాయల నోటుపై ఫోన్ నెంబర్ రాసిస్తుంది. అది కాస్త మిస్ అవుతాడు. ఇక 15 ఏళ్లుగా తన సోల్ మేట్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో తనకు ప్రియ పరిచయం అవుతుంది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు వెతుకుతూనే వాళ్లిద్దరు వీరే అన్న విషయం తెలియకుండా స్నేహం పెంచుకుంటారు. ఫైనల్ గా అవినాష్, ప్రియలుగా ఉన్న వీరు శీను, జున్ను అని తెలుసుకుని ఎలా కలుసుకున్నారు అన్నది తెర మీద చూడాలి.

విశ్లేషణ :

చిన్నప్పుడు విడిపోయిన సోల్ మెట్ ను కేవలం ఒక ఫోన్ నెంబర్ ద్వారా కలవడం అన్న పాయింట్ బాగుంది. అయితే కథగా పాతదే అనిపించినా కథనంలో కొత్తదనం చూపించాడు దర్సకుడు విక్రం కుమార్. సినిమా మొత్తం ఫీల్ ఎక్కడ మిస్ అవకుండా చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, క్లైమాక్స్ లో సీన్స్ మనసుకి హత్తుకుంటాయి. 

సెకండ్ హాఫ్ కథనం కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. కేవలం సినిమా మొత్తం నాలుగు పాత్రల చుట్టే తిరుగుతూ ఉంటుంది. యూత్ ను ఆకట్టుకునే అంశాలతో ఫీల్ గుడ్ మూవీగా వచ్చిన హలో అఖిల్ ను హిట్ ఖాతా తెరిచేలా చేస్తుందని చెప్పొచ్చు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా హలో రంజింపచేసింది. యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చే అవకాశం ఉంది. 

నటన, సాంకేతికవర్గం :

అఖిల్ నటనలో పరిణితి సాధించాడు. డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే కాదు ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. స్టైల్ విషయంలో అఖిల్ క్రేజీగా అనిపించాడు. స్టంట్స్ బాగున్నాయి. ఇక కళ్యాణి ప్రియదర్శిని డైలాగ్స్ తక్కువ అయినా అలరించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ రోల్స్ ఎప్పటిలానే అలరించాయి. అజయ్ కేవలం తక్కువ పాత్రకే అంకితమయ్యాడు. 

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా ఫస్ట్ క్లాస్ గా ఉంది అంటే అది కెమెరా మన్ గొప్పతనమే. మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్ మరోసారి తన మ్యాజిక్ చేశాడు. మనం తర్వాత విక్రం, అనూప్ కాంబో మళ్లీ హిట్ కొట్టినట్టే. స్టంట్స్ విషయంలో ప్రాత్యేక శ్రద్ధ చూపించారు. తెర మీద అది క్లియర్ గా కనబడుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

అఖిల్ సినిమాతో నిరాశ పరచిన అఖిల్ హలో తో ఆకట్టుకున్నాడు..! 


Related Post

సినిమా స‌మీక్ష