ఎం.సి.ఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) రివ్యూ & రేటింగ్

December 21, 2017


img

రేటింగ్ : 2.25/5

కథ :

నాని ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. అన్న ఒక్కడే తన ప్రపంచం.. వదిన వచ్చాక అన్న కూడా దూరం అవుతాడు. హైదరాబాద్ లోని బాబాయ్ ఇంట్లో ఉంటుంటాడు. ఇక వదిన (భూమిక)కు వరంగల్ ట్రాన్స్ ఫర్ అవగా ఆమెకు తోడుగా నానిని పంపిస్తాడు అన్న రాజీవ్ కనకాల. ముందు వదిన మీద కోపం చూపించే నాని తర్వాత ఆమె మంచి మనసుని అర్ధం చేసుకుంటాడు. వదిన చెల్లి పల్లవి నానిని ప్రేమిస్తుంది. నాని కూడా ఆమెకు కనెక్ట్ అవుతాడు. ఇక వరంగల్ లో శివ అనే వ్యక్తి లైసెన్సులు లేకుండా ట్రావెల్స్ నడుపుతుంటాడు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన జ్యోతి శివ బస్సులను సీజ్ చేస్తుంది. ఇక శివ జ్యోతిని టార్గెట్ పెట్టుకుంటాడు. నాని శివను ఎదుర్కుంటాడు. ఫైనల్ గా కథ ఎలా ముగిసింది అన్నదే సినిమా.

విశ్లేషణ :

వరుసగా సక్సెస్ లు కొడుతున్న నాని సినిమాలు చూసి ఆడియెన్స్ కూడా నాని సినిమా అంటే హిట్ గ్యారెంటీ అన్నట్టు ఉన్నారు. అయితే ఎం.సి.ఏ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. కథ కథనాలన్ని పరమ రొటీన్ గా నడిపించారు. సినిమా స్టార్టింగ్ నాని క్యారక్టర్ మొదటి భాగం అంతా టైం పాస్ గా నడిపించినా సెకండ్ హాఫ్ మరి బోర్ కొట్టించేశారు. వదినను కాపాడాలన్న ఒక్క ఆలోచన తప్ప సెకండ్ హాఫ్ పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఓ రకంగా ఆడియెన్స్ విసుగు చెందినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇక దేవి పాటలు మ్యాజిక్ చేయలేకపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వర్క్ అవుట్ అవలేదు. కథ కథనాలే కాదు పాటలు కూడా ఎప్పుడో విన్నట్టుగా ఉన్నాయి. సినిమాలో నాని ఆ తర్వాత భూమిక నటన ఆకట్టుకున్నాయి. బలంగా అనిపించిన సన్నివేశాలు ఉన్నా అవి సినిమాను నిలబెట్టలేకపోయాయి. యూత్ ఎంటర్టైనర్ గా మిడిల్ క్లాస్ అబ్బాయి సత్తా చాటుతుంది అనుకున్న నాని ఎం.సి.ఏ మధ్యలో దారి తప్పిందని చెప్పొచ్చు. 

నటన, సాంకేతిక వర్గం : 

నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని పాత్రలో తన సహజ నటన చూపించాడు. హీరోయిన్ గా సాయి పల్లవికి అంతగా ప్రాధాన్యత లేదని చెప్పాలి. భూమికకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఆమె కూడా బాగానే నటించింది. విలన్ గా విజయ్ పర్వాలేదు అనిపించాడు. అయితే అతని విలనిజం కూడా అంతగా చూపించలేకపోయాడు దర్శకుడు. ఇక నరేష్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల పాత్రలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాలి.

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. సినిమా దర్శకుడు కథ పాతదే అయినా కథనంలో కూడా ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా తీశాడు. సెకండ్ హాఫ్ బోర్ కొట్టించేశాడు. మధ్య మధ్యలో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సమ్మార్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పాటలు రెండు బాగున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఏం గొప్పగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించుకున్నాయి.

ఒక్కమాటలో :

నాని ఎం.సి.ఏ ట్రాక్ తప్పినట్టు ఉన్నాడు..! 


Related Post

సినిమా స‌మీక్ష