చుక్కల్లో రవితేజ రెమ్యునరేషన్..!

December 11, 2017


img

రెండేళ్ల గ్యాప్ తో రవితేజ చేసిన రాజా ది గ్రేట్ హిట్ టాక్ సొంతం చేసుకోగా కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ కు బ్రేక్ ఈవెన్ రాలేదని అంటున్నారు. అయితే ఓవరాల్ గా సినిమా హిట్ అనేస్తున్నారు. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ చేసిన ఈ సినిమా మాస్ రాజా క్రేజ్ మరింత పెంచేసింది. అందుకే రెమ్యునరేషన్ కూడా పెంచాడట రవితేజ తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు 10 కోట్లు ఇస్తేనే సినిమా అంటున్నాడట రవితేజ.

రవితేజకు 10 కోట్లు అంటే సినిమా బడ్జెట్ 30 కోట్లు.. మాస్ రాజా సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే ఆ సినిమా అన్ని వసూళ్లను రాబడుతుంది. ఇక ప్రస్తుతం తన రెమ్యునరేషన్ చెప్పే దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడట రవితేజ. ఇలా రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పే రవితేజ తనకు వచ్చిన ఆఫర్లను కూడా మిస్ అవుతున్నాడని అంటున్నారు. మొత్తానికి రవితేజ రెమ్యునరేషన్ షాక్ తో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.



Related Post

సినిమా స‌మీక్ష