రంగస్థలం వర్సెస్ మహానటి..!

December 11, 2017


img

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోల మద్య పోటీ బాగా నెలకొంది. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి ఒక్కరోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. గత సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఇప్పుడు ఇదే సీన్ రెండు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలకు ఎదురవుతుంది. అసలు విషయానికి వస్తే.. తెలుగు అలనాటి మేటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి సినిమా రూపొందిస్తున్నారు. సినిమాలో మహానటిగా కీర్తి సురేష్ నటిస్తుంది.   

తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేసింది చిత్ర బృందం. రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. మార్చి 29న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక మెగాస్టార్ తనయుడు రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఒక్క రోజు గ్యాప్ లో ఈ రెండు సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏదైనా వాయిదా పడుతుందా లేదా అనేది త్వరలో తెలుస్తుంది.    



Related Post

సినిమా స‌మీక్ష