బాలకృష్ణ తప్పు చేస్తున్నాడా..!

December 08, 2017


img

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం నందమూరి బాలకృష్ణ మంచి ఫామ్ లో ఉన్నారు. కుర్రహీరోలకు ధీటుగా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం క్రిష్ దర్శకత్వంలో గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత పూరి దర్శకత్వంలో పైసా వసూల్ లో నటించారు బాలయ్య. ప్రస్తుతం జై సింహా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ గా ఉన్నాయి.  ఈ పాటలు యూరప్ లో షూట్ చేయబోతున్నారట.

బాలయ్య సరసన నయనతార, హరి ప్రియ, నటాషా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే బాలయ్య ప్రముఖ దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి సినిమాలో నటించనున్నారట. గతంలో వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన టాప్ హీరో పెద్దగా విజయం సాధించలేదు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి కానీ గత పదేళ్లుగా సరైన సినిమాలు లేవు పైగా యమలీల 2 అని తీసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందించాడు. అలాంటి దర్శకుడు తో బాలయ్య సినిమా ఏంటి అని షాక్ అవుతున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ఒకవేళ బాలయ్య అతడితో సినిమా చేస్తే బాలయ్య చేస్తున్న పెద్ద మిస్టేక్ అని అంటున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష